ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు అయితే మంచి హ్యాపీ వైబ్స్ లో ఉన్నారని చెప్పాలి. తమ అభిమాన హీరో ఓ టాక్ షో కి హాజరు కావడం అందులోని బాలయ్య లాంటి సాలిడ్ హోస్ట్ తో పాల్గొననుండడం అనేది అత్యంత ఆసక్తిగా కొన్ని రోజులు నుంచి మారింది.
మరి దీనితో ఈ ఎపిసోడ్ ఆహా లో ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ కి వస్తుందా అని అంతా ఎదురు చూసారు. ఇక ఎట్టకేలకు నిన్న రాత్రి నుంచి స్ట్రీమింగ్ వచ్చిన ఈ ఎపిసోడ్ సెన్సేషనల్ రెస్పాన్స్ ని అయితే ఆహాలో నమోదు చేసింది. మరి ఈ క్రేజీ ఎపిసోడ్ లో అయితే బాలయ్య ప్రభాస్ ని భగవంతునితో పోల్చడం అనేది వైరల్ గా మారింది.
స్టార్టింగ్ లోనే ప్రభాస్ డ్రెస్సింగ్ కోసం అంతా మాట్లాడుతూ ఉండగా ప్రభాస్ అయితే తనకి డ్రెస్సింగ్ ఎలాంటి ఇబ్బంది లేదు కానీ షూ మాత్రం దొరకట్లేదని చెప్పుకొచ్చాడు. తన 12.5 ఉంటుందని చెప్పగా దానికి బాలయ్య అంటే వెంకటేశ్వర స్వామి పాదం అంత ఉంటుంది అని తెలిపారు.
ఈ అంశం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. భగవంతుని కోసం పురాణాల కోసం బాలయ్య కి కొట్టిన పిండి. తన తండ్రి ఎన్టీఆర్ నుంచి ఇవన్నీ తాను అవపోసన పట్టారు. అందుకే ప్రభాస్ తన పాదం సైజ్ చెప్పగానే వెంకటేశ్వర స్వామి పాదంతో పోలుస్తూ తెలిపారు. ఈ షో లో ఇది ఒకింత డివోషనల్ గా అనిపించింది అని చెప్పొచ్చు.