ప్రస్తుతం ప్రపంచం అంతా గూగుల్ చుట్టే తిరుగుతుంది. ఎవరికి ఏది కావలన్నా కూడా గూగుల్ తల్లినే నమ్ముకుంటున్నారు. తినే తిండి దగ్గర నుండి పడుకునే పరుపు వరకు కూడా గూగుల్‌పై ఆధారపడున్నారు. అయితే దీనిని గుడ్డిగా నమ్మిన లేనిపోని అనర్దాలు తెచ్చుకోవడం ఖాయం అని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న మాట. తాజాగా కేజీఎఫ్ 2 విషయంలో గూగుల్ చెప్పిన మాట ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరి గూగుల్ చెప్పిన ఆ మాటేంటో మీకు తెలుసుకోవాలని ఉంది కదా.. ఇంకెందుకు మరి ఆలస్యం స్టోరీలోకి పదండి..
కన్నడ చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచిన సూపర్ హిట్ చిత్రం కేజీఎఫ్. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యష్, సంజయ్ దత్, రవీనా టాండన్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. గరుడని హత్య చేసి నరాచిలో తన సామ్రాజ్యాన్ని రాఖీ ఎలా బిల్డ్ చేసుకున్నాడు అనే నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుండగా, ఈ మూవీకి సంబంధించిన టీజర్ జనవరి 8న ప్రధాన పాత్ర ధారుడు యష్ బర్త్‌డే సందర్భంగా విడుదల కానుంది.
ఇక కేజీఎప్ 2 నుండి ఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది. అదేమంటే చిత్రంలో బాలకృష్ణ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు గూగుల్ చెప్పడం. గూగుల్ సెర్చ్ బార్‌లో కేజీఎఫ్ 2 అని టైప్ చేయగా, చిత్రంలో నటిస్తున్న ప్రముఖల పేర్లతో పాటు బాలకృష్ణ పేరు, ఫొటోకనిపించాయి. ఇనయత్ ఖలీల్ అనే పాత్రలో ఆయన కనిపించనున్నట్టు గూగుల్ తల్లి చెప్పింది. దీంతో ఈ విషయం అంతటా చర్చనీయాంశంగా మారింది. తప్పిదం వలన ఇలా కనిపిస్తుందా, లేదంటే నిజంగానే బాలకృష్ణ కేజీఎఫ్ 2లో నటిస్తున్నాడా అనే దానిపై అంతా కన్ఫ్యూజన్‌లో ఉన్నారు.