బాలకృష్ణ కొత్త సినిమాకి ఆ క్రేజీ టైటిల్ !

యాక్షన్ సినిమాలకి పెట్టింది పేరు నటసింహ నందమూరి బాలకృష్ణ. యాక్షన్ సినిమాల్లో నటసింహం నట విశ్వరూపం చూపిస్తారు. అందుకే, బాలయ్య తో సినిమా చేసే దర్శకులు ఇలాంటి పవర్ ఫుల్ సబ్జెక్టు, పవర్ ఫుల్ పాత్రలను క్రియేట్ చేస్తుంటారు.

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న మూడో చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. సింహ , లెజెండ్ వంటి భారీ బ్లాక్ బ్లాస్టర్ హిట్స్ తర్వాత రాబోతున్న సినిమా కావడం తో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.

ఇదిలా ఉంటే .. బాలకృష్ణతో ఓ సినిమా చేయాలని, ఆయన ఇమేజ్‌కు తగ్గట్లు కందిరీగ , రభస వంటి చిత్రాలను చేసి, ప్రస్తుతం ‘అల్లుడు అదుర్స్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న దర్శకుడు సంతోశ్‌ శ్రీనివాస్ ఓ కథను సిద్ధం చేసుకున్నారట. రీసెంట్‌గా ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత అనీల్‌ సుంకరను కలిసి కథను వినిపించారట సంతోష్‌ శ్రీనివాస్‌. నిర్మాతలకు కథ బాగా నచ్చింది. ఇప్పుడు నిర్మాతలు బాలకృష్ణను సంప్రదించి ఆయన డేట్స్‌ను సంపాదించాలనే ప్రయత్నంలో ఉన్నారట. ఈ సినిమాకు ‘బలరామయ్య బరిలోకి దిగితే’ అనే టైటిల్‌ను కూడా అనుకుంటున్నారట‌.

ఇక బి.గోపాల్ తో కూడా బాలయ్య ఓ సినిమా చేయాల్సివుంది. ఈలోగా.. శ్రీ‌వాస్ కూడా బాల‌య్య కోసం ఓ క‌థ రెడీ చేస్తున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. ఇప్పుడు సంతోష్ శ్రీ‌నివాస్ కూడా త‌న ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టాడు.