బాక్సాఫీస్ : 10 రోజుల్లో “భగవంత్ కేసరి” వసూలు చేసింది ఎంతంటే 

టాలీవుడ్ సినిమా మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన పీక్ స్టేజి లో ఉన్న సంగతి తెలిసిందే. కాగా బాలయ్య ఇప్పుడు వరుసగా మూడు భారీ హిట్స్ తో హ్యాట్రిక్ కొత్తగా మూడు చిత్రాలతో కూడా బాలయ్య 100 కోట్ల గ్రాస్ చిత్రాలని అందుకొని మరో రేర్ రికార్డు సెట్ చేసాడు.

మరి దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన కొత్త చిత్రమే “భగవంత్ కేసరి” కాగా ఈ సినిమా మొదటి రోజు నుంచే సాలిడ్ వసూళ్లు అందుకుంటున్నట్టుగ్గ ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు. అలాగే చిత్ర యూనిట్ కూడా అఫీషియల్ గా భారీ నంబర్స్ అనౌన్స్ చేసుకున్నారు.

ఇక అలా ఇపుడు ఈ చిత్రం అయితే మొత్తం 10 రోజుల రన్ ని బాక్సాఫీస్ దగ్గర కంప్లీట్ చేసుకోగా ఇప్పుడు ఈ 10 రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఎంత వసూలు చేసిందో తెలిపారు. దీనితో ఈ చిత్రం 123.92 కోట్లు రాబట్టినట్టుగా అధికారిక నంబర్స్ అనౌన్స్ చేశారు. దీనితో అయితే ఈ సినిమా బాలయ్య కెరీర్ లో మరో మంచి లాంగ్ రన్ లోకి వెళ్తుంది అని చెప్పొచ్చు.

కాగా ఈ వసూళ్లు నిజం అయితే సినిమా ఆల్ మోస్ట్ బ్రేకీవెన్ కి దగ్గరగా వచ్చేసినట్టే అని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన యువ నటి శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో నటించింది. అలాగే థమన్ ఎస్ సంగీతం అందించగా ఇది కూడా తనకి బాలయ్యతో అఖండ, వీరసింహా రెడ్డి తర్వాత హ్యాట్రిక్ సినిమా ఇలా ఇద్దరూ హ్యాట్రిక్ కొట్టారు.