అల్లు అరవింద్ తో చిరంజీవికి విభేదాలు…. ఆ కార్యక్రమంతో బయట పెట్టేసిన చిరు!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో మహావృక్షంగా మారిపోయిన మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే అయితే ప్రస్తుతం ఈయన వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా జనవరి 13వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవుతూ వృత్తిపరమైన వ్యక్తిగతమైన విషయాల గురించి ఈయన మాట్లాడారు. అయితే గత కొన్ని రోజులుగా అల్లు అరవింద్ కుటుంబానికి చిరంజీవి కుటుంబానికి మధ్య మనస్పర్ధలు వచ్చాయంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఎప్పటికప్పుడు ఖండించే ప్రయత్నం చేసినప్పటికీ ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మరోసారి చిరంజీవి తమ రెండు కుటుంబాల మధ్య ఏ విధమైనటువంటి విభేదాలు లేవని చెప్పేశారు.మా కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగిన అందరూ ఒకే చోట చేరి జరుపుకుంటామని చిరంజీవి వెల్లడించారు. మొన్న క్రిస్మస్ వేడుకలలో పెద్దవాళ్లు లేకపోయినా పిల్లలంతా మా ఇంట్లో ఘనంగా జరుపుకున్నారని చిరు తెలిపారు.అల్లు అరవింద్ తో నాకున్నటువంటి విభేదాల కారణంగానే అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా బాలకృష్ణను ఎంపిక చేసుకున్నారనే వార్తలపై కూడా చిరంజీవి స్పందించారు.

ఈ సందర్భంగా ఈ విషయంపై చిరంజీవి మాట్లాడుతూ అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా బాలకృష్ణను ఎంపిక చేసుకోవడానికి కారణం నేను బిజీగా ఉండడమే కావచ్చు.అయితే ఈ కార్యక్రమానికి నేను వ్యాఖ్యాతగా వ్యవహరించకపోయిన ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతుందని, మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నామని ఈ సందర్భంగా అల్లు అరవింద్ బాలకృష్ణతో అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని చేయడం గురించి కూడా చిరంజీవి స్పందించి క్లారిటీ ఇచ్చారు.