చిరంజీవికి హ్యాండ్ ఇచ్చిన శృతిహాసన్… బెదిరించారు అంటూ చిరు షాకింగ్ కామెంట్స్..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ప్యాంటు ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి స్వయంకృషితో అంచలంచలుగా ఎదుగుతూ ఒక మెగా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. టాలీవుడ్ లో నంబర్ వన్ హీరోగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన చిరంజీవి కొంతకాలం సినిమాలకు దూరమై రాజకీయాలలో చురుకుగా పాల్గొన్నారు. అయితే తనకు రాజకీయాలు సెట్ అవ్వని భావించిన చిరంజీవి తర్వాత తాను స్థాపించిన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి మళ్లీ సినిమా ఇండస్ట్రీలో ఇచ్చాడు.

ఇక ఇండస్ట్రీలో రియంట్రీ ఇచ్చిన చిరంజీవి వరుస సినిమాలలో నటిస్తూ హిట్స్ అందుకుంటున్నాడు. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమా ద్వారా హిట్ అందుకున్న చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఈ సినిమా జనవరి 13వ తేదీ విడుదల చేయడానికి సినిమా యూనిట్ అన్ని సన్నాహాలు పూర్తి చేసింది. ఇక విడుదల తేదీ దగ్గర పడటంతో ఇటీవల సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని విశాఖపట్నంలో చాలా ఘనంగా నిర్వహించారు. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రుతిహాసన్ తప్ప సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. అయితే ఇలా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి శృతిహాసన్ హాజరు కాకపోవటంతో అనేక వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా శృతిహాసన్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కాకపోవడానికి గల కారణాల గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వాల్తేరు వీరయ్య సినిమాతో పాటు శృతిహాసన్ వీర సింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ సరసన హీరోగా నటించింది. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి పోటీ పడనున్నాయి. ఇక ఇటీవల వీర సింహారెడ్డి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఒంగోలులో నిర్వహించారు. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన శృతిహాసన్ వాల్తేరు వీరయ్య ఈవెంట్ కి హాజరు కాకపోవటంతో చిరంజీవి మాట్లాడుతూ..ఆరోగ్యం బాగాలేదని శృతిహాసన్ తనకు ఫోన్ చేసి చెప్పిందని వెల్లడించారు. అయితే శృతి హాసన్ ని ఈ ఈవెంట్‌కు రాకుండా ఎవరో బెదిరించారంటూ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వాల్తేరు వీరయ్య ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి రాకుండా ఉండటానికి శృతిహాసన్ ని బాలకృష్ణ బెదిరించినట్లు చిరంజీవి వ్యాఖ్యలు చేశాడని బాలయ్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.