బాలయ్య కూడా వద్దన్నాడట.!

రీమేకుల ట్రెండ్ బాగా నడుస్తోంది. సీనియర్ హీరోలూ, యంగ్ హీరోలూ అనే తేడా లేకుండా రీమేకుల్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. ఈ తరుణంలోనే ‘భగవంత్ కేసరి’ టైమ్‌లో ఓ రీమేక్ సబ్జెక్ట్ బాలయ్య చెంతకు వచ్చిందట.

అయితే, ఆ రీమేక్‌ని బాలయ్య వద్దన్నాడట. మామూలుగా అయితే బాలయ్య కూడా రీమేకులకు వ్యతిరేకం కాదు. కానీ, బాలయ్యకు అత్యంత సన్నిహితుడైన ఓ డైరెక్టర్ బాలయ్యకు ఈ సూచన చేశాడట. అయితే, ప్రస్తుతం బాలయ్య చేస్తున్న ‘భగవంత్ కేసరి’ని రీమేక్ అంటున్నారు.

కాదు, కాదు ప్రీమేక్ అని కూడా ప్రచారం జరుగుతోంది. వాస్తవమేంటనేది తెలియాల్సి వుంది. ఇదిలా వుంటే, రీమేక్ ప్రపోజల్ తెచ్చిన డైరెక్టర్ కూడా ఏమంత ఆషా మాషీ డైరెక్టరేం కాదట. ఇటీవల బాలయ్యతో ఓ సూపర్ హిట్ సినిమా తీసిన డైరెక్టర్ అనీ తెలుస్తోంది. అయితే, బాలయ్య ఈ ప్రాజెక్ట్‌కి పూర్తిగా నాట్ ఓకే చెప్పేయలేదట. జస్ట్ అలా హోల్డ్‌లో పెట్టి వుంచాడనీ తెలుస్తోంది. అసలు సంగతేంటటనేది ముందు ముందు తెలియాల్సి వుంది.

‘భగవంత్ కేసరి’ పూర్తయ్యాకా ఆ రీమేక్ గురించి ఆలోచన చేస్తాడనీ ఆయన సన్నిహితుల ద్వారా అందుతోన్న సమాచారం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్, శ్రీలీల ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ పోషిస్తున్నారు.