క్రేజీ : ఫస్ట్ టైం రికార్డు టీఆర్పీ అందుకున్న “బలగం”.!

పలు చిన్న చిత్రాలు ఒకోసారి సైలెంట్ గా వచ్చి మాస్ హిట్స్ అవుతూ ఉంటాయి. ఆ సినిమాకి జరిగిన బిజినెస్ గాని వాటికొచ్చే లాభాలు గాని రికార్డు స్థాయిలో ఉంటాయి. అలా ఏడాది ట్రేడ్ లో అందరికీ షాకిచ్చిన సినిమా విజయం “బలగం” కి దక్కింది. నటుడు టిల్లు వేణు దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా ఇది కాగా..

దీనిని కూడా ఊహించని ఎమోషన్స్ తో తెరకెక్కించడం నేటి తరం పెద్దలు అందరికీ తమ పాత రోజులు అన్నీ గుర్తుకు రావడం వంటివి చేసాడు. దీనితో ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ అయ్యి భారీ లాభాలు తెచ్చి పెట్టింది. దీనితో ఈ చిత్రం ఓటిటి లో కూడా పెద్ద హిట్ అయ్యింది. ఇంతేనా తర్వాత అనేక ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడాగెలుపొంది అదరగొట్టింది.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం రీసెంట్ గానే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానెల్లో టెలికాస్ట్ చేయగా దీనికి రీసెంట్ టైంస్ లో పెద్ద హీరో సినిమాకి కూడా రాని భారీ రేటింగ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. కాగా ఈ చిత్రం అయితే ఏకంగా 14.3 రేటింగ్ పాయింట్స్ ని నమోదు చేసిందట.

ఇది రీసెంట్ గా వచ్చిన వీరసింహా రెడ్డి కన్నా చాలా ఎక్కువ. మొత్తానికి అయితే ఈ చిన్న సినిమా బుల్లితెరపై కూడా సత్తా చాటింది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో యంగ్ నటీ నటులు ప్రియదర్శి మరియు కావ్య కళ్యాణ్ రామ్ లు నటించారు. అలాగే భీమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు తన బ్యానర్ లో రిలీజ్ చేశారు.