ఆస్కార్‌ రేసులో బలగం, దసరా సినిమాలు

అనితర సాధ్యం అనుకున్న ఆస్కార్‌ను ఆర్‌ఆర్‌ఆర్‌ గెలిచి తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గానూ బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో అవార్డు వరించింది. ఈ సినిమా ఇచ్చిన ఊపుతో పలువురు దర్శక నిర్మాతలు తమ సినిమాలను ఆస్కార్‌ రేంజ్‌లో ప్లాన్‌ చేస్తున్నారు.

ఇక వచ్చే ఏడాది జరిగే ఆస్కార్‌ కోసం ఇప్పటి నుంచే సినిమాల ఎంపిక కోసం కసరత్తులు చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు 22 సినిమాలు అధికారిక ఎంట్రీకి వచ్చినట్లు ఇన్‌సైడ్‌ టాక్‌. ఆ 22 సినిమాల్లో రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. అవే బలగం, దసరా సినిమాలు. ఇక వీటీతో పాటుగా ది కేరళ స్టోరీ, గదర్‌`2, రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహాని, జ్విగాటో, దీ స్టోరీ టెల్లర్‌ వంటి పలు సినిమాలు ఎంట్రీకి వెళ్లాయి. ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ గిరీష్‌ కాసరవల్లి నేతృత్వంలో 17 మంది సభ్యులతో కూడిన ఆస్కార్‌ కమిటీ చెన్నై వేదికగా ఆస్కార్‌ ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకున్న సినిమాలను వీక్షిస్తోంది.

బలగం, జ్విగాటో, విడుదలై`1 సినిమాల్లో ఒకటి ఆస్కార్‌ ఎంట్రీ సాధించే చాన్స్‌లు అధికంగా ఉన్నాయని సమాచారం. మరి ఈ సారి ఆస్కార్స్‌కు భారత్‌ నుంచి ఏ సినిమాను పంపుతారో చూడాలి. ఇక ఈ మధ్యనే జవాన్‌ దర్శకుడు అట్లీ.. ఓ సందర్భంలో ఆస్కార్‌కు జవాన్‌ సినిమా కూడా నామినేషన్‌కు పంపే ఆలోచినలో ఉన్నామని చెప్పి ట్రోలర్‌ రాయుళ్లకు టార్గెట్‌ అయ్యాడు.

కమర్షియల్‌ సినిమాను అకాడవిూ అవార్డులకు పంపి ఏం సందేశం ఇవ్వాలను కుంటున్నారని నెటిజెన్లు గట్టిగానే ట్రోల్స్‌ చేశారు. ఇక రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహాని సినిమా కూడా ఏ విధంగా ఆలోచించి ఆస్కార్‌ ఎంట్రీకు రెడీ చేశారని పలువురు నెటీజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు.