ఇపుడు మన ఇండియన్ సినిమా దగ్గర డెఫినెట్ గా ఒక గేమ్ ఛేంజింగ్ దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది దర్శక శిఖరం రాజమౌళి అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అయితే రాజమౌళి ఇలా ఒకో భారీ సినిమాలు చేయడం అనేది సరిగ్గా అయితే యమదొంగ నుంచి స్టార్ట్ అయ్యింది అని చెప్పాలి.
తర్వాత మగధీర, ఈగ చిత్రాలతో నేషనల్ సినిమాని తన వైపు చూసేలా చేసిన రాజమౌళి వాటి తర్వాత చేసిన సెన్సేషనల్ సినిమాలు బాహుబలి తో ప్రపంచ సినిమా చూసేలా చేశారు. అయితే బాహుబలి విషయంలో ఏది కూడా అంత తేలిగ్గా జరగలేదు. మేకర్స్ ఎన్నో ఏళ్ల కష్టం తమ సినిమాని ప్రపంచ సినిమా దగ్గర అయితే ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశారు.
మరి ఇప్పుడు ఈ సినిమా హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం “ప్రాజెక్ట్ కే” హాలీవుడ్ ప్రముఖ ఈవెంట్ కామిక్ కాన్ కి అయితే వెళ్లినట్టుగా వార్తలు రావడం ఇండియన్ సినిమాకి గర్వకారణంగా మారగా అయితే ఈ ఈవెంట్ కి సంబంధించి ఇదే మొదటి ఇండియన్ సినిమాగా ప్రాజెక్ట్ కే అంటూ ఇప్పుడు ప్రచారం జరుగుతుంది.
అయితే ఈ ప్రైడ్ ఇన్సిడెంట్ పై బాహుబలి యూనిట్ స్పందించింది. ఇది నిజంగా గ్రేట్ అని అయితే తాము ఇదే ఈవెంట్ 2014 లో ఇండియా లో జరిగినప్పుడు వెళ్లాం అని కానీ అప్పట్లో చాలా మందికి ఆ విషయం తెలీదు. కానీ అక్కడ నుంచి ఇంటర్నేషనల్ ఈవెంట్ లో ప్రాజెక్ట్ కే ని చూడడం అయితే చాలా ఆనందంగా ఉంది అని బాహుబలి యూనిట్ ట్వీట్ చేసింది. దీనితో ఈ ట్విస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
Happy to see this! ❤️❤️
When we went to Comic Con in India in 2014, many fans and the audience heard about it for the first time, as they weren't very aware of it back then.
From there to now, going to the International Comic Con has been a remarkable journey for Indian Cinema! https://t.co/9bUqRQb52l
— Baahubali (@BaahubaliMovie) July 7, 2023