బాహుబలి 2 రికార్డులు బద్దలు కొట్టిన పఠాన్

జీరో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన షారుక్ ఖాన్ ఆ సినిమాతో డిజాస్టర్ అందుకోవడంతో ఇక ఆయన పని అయిపోయిందనే కామెంట్లు వినిపించాయి. దానికి తగినట్లుగానే ఆయన కూడా సినిమాల మీద ఆసక్తి చూపించకుండా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు. దీంతో ఇక పూర్తిగా ఆయన సినిమాలు మానేస్తాడేమో అని కూడా కొన్ని కామెంట్లు వినిపించాయి.

అయితే ఎట్టకేలకు ఆయన పఠాన్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలబడమే కాదు. సంచలన వసూళ్లతో ముందుకు దూసుకువెళ్తుంది. షారుక్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో దీపిక పడుకునే హీరోయిన్ గా నటించిన పాత్రలో నటించాడు. సిద్ధార్థ ఆనందా దర్శకత్వంలో యశ్ రాజ్ ఫీలిమ్స్ బ్యానర్ మీద ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు.

యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి వచ్చిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం మొదటి రోజు నుంచి సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో వసూళ్ల విషయంలో కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఏకంగా 33 రోజులపాటు కోటి రూపాయలకు తగ్గకుండా కలెక్షన్లు సాధిస్తూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు 500 కోట్ల కలెక్షన్లు ఒక్క హిందీ బెల్ట్ లోనే దాటేసి ఇప్పుడు బాహుబలి 2 రికార్డును కూడా దాటినట్లు అయింది.

బాహుబలి ది కన్‌క్లూజన్ హిందీ వెర్షన్ రూ.511 కోట్ల కొల్లగొట్టగా.. పఠాన్ రూ.529 కోట్లతో ఆ రికార్డును బ్రేక్ చేసిందన్న మాట. వాస్తవానికి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి 2 సినిమా ఇప్పటివరకు హిందీ బెల్ట్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇప్పుడు ఆ సినిమాని దాటేసి పఠాన్ ఆ స్థానాన్ని ఆక్రమించింది అనమాట. ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించారు. కనిపించింది కొద్దిసేపైనా ఆయన అభిమానులు సైతం సినిమాని ఎంకరేజ్ చేశారు. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ విడుదల అయింది.