‘సలార్‌’కు ముందే ‘బఫీురా’ టీజర్‌ విడుదల

కేజీఎఫ్‌, కాంతారా చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ ప్రస్తుతం సలార్‌ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేసింది. కన్నడ స్టార్‌ హీరో శ్రీమురళి హీరోగా హోంబలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘బఫీురా’ .

ఈ సినిమాకు కేజీఎఫ్‌ సినిమా ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ కథ అందిస్తుండగా.. డాక్టర్‌ సూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్‌ లుక్‌ విడుదల చేయగా మంచి రెస్పాన్స్‌ దక్కించుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్‌ టీజర్‌ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు.

ఈ సినిమా టీజర్‌ను శ్రీమురళి పుట్టినరోజు కానుకగా డిసెంబర్‌ 17న ఉదయం 9.45 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం సోషల్‌ విూడియా వేదికగా ప్రకటించింది. ఇక ఈ సినిమా శ్రీమురళికి గొప్ప పేరు తెచ్చిపెడుతుందని చిత్రబృందం ఎంతో నమ్మకంగా ఉంది.