హరీష్ శంకర్‌.! ఎక్కడో తేడా కొడుతోందే.!

సాధారణంగా నటీనటులు, దర్శక నిర్మాతలకు సంబంధించిన స్పెషల్ డేస్.. అంటే, పుట్టినరోజుల సందర్భంగా ఆయా సినిమాల నుంచి ఏదో ఒక అప్డేట్ అయితే వుంటుంది. కానీ, దర్శకుడు హరీష్ శంకర్ విషయంలో అలాంటిదేమీ జరగలేదు. చాలాకాలంగా ఆయన పవన్ కళ్యాణ్‌తో సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు.

అదే ‘భవదీయుడు భగత్ సింగ్’ అది కాస్తా పేరు మార్చుకుని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అయ్యింది. పేరు మారిందేగానీ, హరీష్ శంకర్ ఫేటు అయితే మారలేదన్నట్టుంది పరిస్థితి. హరీష్ శంకర్ పుట్టినరోజు సందర్భంగా అయినా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ అప్డేట్ ఇచ్చి వుండొచ్చు కదా.? అప్డేట్ రాలేదంటే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం లేదన్నమాట.

వచ్చే ఏడాది నాటికైనా.? అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.. పవన్ కళ్యాణ్ మాత్రం, ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందించారు హరీష్ శంకర్‌కి. ఏప్రిల్ మొదటి వారంలో సినిమా సెట్స్ పైకి.. అనే ప్రచారమైతే జరుగుతోంది. అదెంత నిజమో.?