అక్కినేని హీరో అఖిల్ నటిస్తున్న ‘ఏజెంట్’ సినిమాకి మొదట్లో బజ్ బాగా క్రియేట్ అయ్యింది. డైరెక్టర్ సురేందర్ రెడ్డి నుంచి కావచ్చు.. మరింకేదైనా రీజన్ కావచ్చు. 100 కోట్ల సినిమా అవుతుందిది అని అంచనా వేశారు. అయితే, ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోయాయ్. ఇప్పటికే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావల్సి వుంది.
వాయిదాల మీద వాయిదాలు కాగా, ఎట్టకేలకు ఈ నెల 28న సినిమా రిలీజ్ అవుతోంది. ఇది డ్రై సీజన్‌గా పేర్కొంటున్నారు. రాంగ్ టైమింగ్ అనీ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
రాంగ్ టైమింగ్‌లో ‘ఏజెంట్’ రిలీజ్ పడిందని అభిప్రాయపడుతున్నారు. దాంతో ఇంతవరకూ క్రియేట్ అయిన బజ్ పూర్తిగా పోయింది.
జీరో బజ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అఖిల్ ఏజెంట్‌గా. అసలే అఖిల్‌కి ఇది ప్రెస్టీజియస్ మూవీ. అన్నీ కలిసొచ్చి బ్యాడ్ టైమ్ కాస్తా గుడ్ టైమ్‌గా మారి, సినిమా సక్సెస్ అయ్యిందంటే, అక్కినేని అభిమానులు ఖుషీ ఖుషీనే. చూడాలి మరి, ఏం జరుగుతుందో.!
