చేదు అనుభవాన్ని మిగిల్చిన భరోజ్.. మోహన్ లాల్ పరువు పోయింది గా!

మలయాళం నటుడు మోహన్ లాల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. డబ్బింగ్ సినిమాల ద్వారా మాత్రమే కాకుండా జనతా గ్యారేజ్ అనే స్ట్రెయిట్ తెలుగు సినిమాతో ప్రేక్షకులకు బాగా చేరువైన నటుడు మోహన్లాల్. ఈయన ఆయన తరంలో మమ్ముటికి గడ్డి పోటీ ఇచ్చారు, ఈ తరంలో కుర్ర హీరోలుగా కూడా అంతే పోటీని ఇస్తున్నారు. ఐతే ఇన్నేళ్లలో ఎప్పుడూ చేయని సాహసం ఈ ఏడాది ఆయన చేశారు.

తాజాగా ఆయన మెగా ఫోన్ పట్టుకొని బరోజ్ అనే 3d ఫిలిం కి దర్శకత్వం వహించారు. ఎపిక్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ఈ సినిమాని ఆశీర్వాద్ సినిమా ఆంటోనీ పెరుంబవూర్ గ్రాండ్ గా నిర్మించారు ఈ చిత్రాన్ని నిర్మాతగా ఆయన పేరు పడలేదు కానీ.. ప్రొడక్షన్ అంతా ఆయనదే. ఆశీర్వాద్ సినిమాస్ అంటే ఆయన సొంత సంస్థ లాంటిదే. క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న విడుదలైన ఈ సినిమా 80 కోట్ల బడ్జెట్ తెరకెక్కింది. అయితే చివరికి క్లాసిక్ మిస్టేక్ గా మిగిలిపోయింది.

అతి పెద్ద డిసార్డర్ ని మూట కట్టుకొని అభిమానులకి నిరాశని మిగిల్చింది. టీజర్, ట్రైలర్లతోనే ఈ సినిమా పెద్దగా హైప్ ని క్రియేట్ చేయలేక పోయింది. ఇక సినిమా విడుదలైన తర్వాత మోహన్ లాల్ రేంజ్ కి తగ్గ ఓపెనింగ్స్ ని రాబట్టుకోలేకపోయింది. ఈ చిత్రం తొలి రోజు కేరళలో రూ.3 కోట్ల లోపు వసూళ్లు రాబట్టింది. వీకెండ్లో కేవలం రూ.6 కోట్ల కలెక్షన్లతో సరిపెట్టుకుంది. కథ బాగున్నప్పటికీ కథనం సాగదీస్తున్నట్టుగా అనిపిస్తూ బాగా బోరింగ్ గా అనిపించింది.

అయితే గతవారం రిలీజ్ అయిన ఉన్ని ముకుందన్ సినిమా సూపర్ హిట్ టాక్ తో మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. నిజానికి మోహన్ లాల్ దగ్గర ఉన్ని ముకుందన్ చాలా చిన్న నటుడు. ఇప్పుడు అతను సినిమా ముందు మోహన్ లాల్ సినిమా వెలవల పోవడంతో మోహన్ లాల్ అభిమానులు ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. భరోజ్ సినిమా ఎంత పెద్ద డిజార్డర్ అంటే మళ్ళీ జీవితంలో మోహన్ లాల్ మెగా ఫోన్ పట్టుకోరేమో అని కామెంట్స్ చేస్తున్నారు మలయాళ సినీ వర్గం వారు.