బాక్సాఫీస్ : ఫస్ట్ వీక్ “బేబీ” వరల్డ్ వైడ్ టోటల్ వసూళ్లు ఇవే.!

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర అదిరే రన్ తో బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న ఓ చిన్న సినిమా “బేబీ”. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా యూట్యూబ్ సెన్సేషనల్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన సినిమా ఇది కాగా దీనిని అయితే దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించాడు.

అయితే ఈ సినిమా ప్రీమియర్స్ తోనే సూపర్ టాక్ తెచ్చుకొని మొదటి రోజు ఊహించని వసూళ్లు నమోదు చేసిన ఈ చిత్రం అక్కడ నుంచి స్టార్ట్ చేసిన బాటింగ్ వరల్డ్ వైడ్ గా వారం రోజులు రన్ ని కంప్లీట్ చేసుకుంది. కాగా ఈ వారం రోజులు రన్ కూడా ప్రతి రోజు మొదటి రోజు కంటే ఎక్కువ ధీటుగానే వసూళ్లు రాబట్టింది తప్పితే ఎక్కడా డ్రాప్ అయ్యినట్టుగా అనిపించలేదు.

దీనితో బేబీ మాత్రం ఇప్పుడు భారీ వసూళ్లతో దూసుకెళ్తుంది. అయితే ఇప్పుడు ఈ వారం రోజుల రన్ ని కంప్లీట్ చేసుకోగా ఈ మొత్తం 7 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 49.2 కోట్ల వసూళ్లు రాబట్టి సెన్సేషనల్ మైల్ స్టోన్ 50 కోట్లకి చేరువ అయ్యిపోయింది. దీనితో బేబీ బాక్సాఫీస్ రన్ మాములుగా లేదని చెప్పాలి.

అలాగే పవన్ సాయి ధరమ్ తేజ్ ల “బ్రో” వచ్చే వరకు కూడా బేబీ దంచికొడుతుంది అని చెప్పాలి. ఈ వారం సినిమాలు చాలానే ఉన్నాయి “హిడింబ” అనే సినిమా మంచి టాక్ తెచ్చకుంది కానీ దాని వైపు జనం ఇంట్రెస్ట్ చూపిస్తే దీనికి ఏమన్నా ఎఫెక్ట్ పడొచ్చు ఏమో కానీ మళ్ళీ ఈ వీకెండ్ లో బేబీ దుమ్ము లేపే ఛాన్స్ ఉందని చెప్పి తీరాలి. 
https://twitter.com/sairazesh/status/1682284884071702529?s=20