“బేబీ” బాక్సాఫీస్ మేనియా..లేటెస్ట్ వసూళ్ల డీటెయిల్స్.!

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర సెన్సేషనల్ హిట్స్ అయ్యినటువంటి చిత్రాల్లో లేటెస్ట్ గా వచ్చిన యూత్ ఫుల్ భారీ హిట్ చిత్రం “బేబీ” కూడా ఒకటి. మరి ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఇప్పటికి 6 రోజులు కంప్లీట్ కాగా ఈ చిత్రం తెలుగు స్టేట్స్ సహా యూఎస్ లో కూడా అసలు తగ్గడం లేదని చెప్పాలి.

అయితే ఈ మొత్తం ఆరు రోజుల్లో అయితే బేబీ చిత్రం మాసివ్ రన్ ని కొనసాగిస్తూ ఇప్పుడు ఏకంగా 44 కోట్ల మేర గ్రాస్ కి అయితే చేరుకుంది. ఇప్పుడు అయితే 43.8 కోట్ల గ్రాస్ మార్క్ దగ్గర ఉన్న ఈ చిత్రం ఈ రెండు రోజుల్లో స్యూర్ షాట్ గా 50 కోట్ల మార్క్ ని ఇది టచ్ చేస్తుంది అని చెప్పాలి.

కాగా ఈ సినిమా మొదటి వారాంతం రన్ తోనే ట్రేడ్ పండితులు సినిమా ఖచ్చితంగా 50 కోట్ల నుంచి 60 కోట్లు వసూలు చేస్తుంది అని చెప్పారు. దీనితో ఇప్పుడు ఇదే నిజం అవుతుండగా మరి ఫైనల్ రన్ లో బేబీ ఎక్కడ ఆగుతుందో కూడా చూడాలి. కాగా ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించగా యువ నటీనటులు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య అలాగే విరాజ్ లు నటించారు.

ఇక దీనితో పాటుగా ఈ చిత్రాన్ని అయితే నిర్మాతలు ఎస్ కె ఎన్ సహా దర్శకుడు మారుతిలు నిర్మాణం వహించారు. ఇప్పటికే ఈ చిత్రం దర్శకుడు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లాంటి దిగ్గజాలు ప్రశంసలు అందుకొని థియేటర్స్ లో ఇంకా సాలిడ్ రన్ తో మేనియా కొనసాగిస్తుంది. 
https://twitter.com/sairazesh/status/1681915861425090561?s=20