గత కొన్ని వారాలుగా ఢీ షోలో బాబా భాస్కర్ చేసే రచ్చ అందరికీ తెలిసిందే. శేఖర్ మాస్టర్‌కు కరోనా సోకడంతో కొంత గ్యాప్ ఇచ్చాడు. శేఖర్ మాస్టర్ ప్రస్తుతం కోలుకున్నా కూడా కాస్త విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ మధ్యలోని గ్యాప్‌ను ఫిల్ చేసేందుకు బాబా మాస్టర్‌ను రంగంలోకి దించారు. అయితే బాబా వచ్చాక ఎంటర్టైన్మెంట్ డోస్ పదింతలు పెరగింది. అయితే అందులో మాస్టర్ మాత్రం కాస్త శృతి మించాడు.
ప్రతీసారి సుడిగాలి సుధీర్‌ను మాత్రం ఓ రేంజ్‌లో ఆడుకుంటూ వచ్చాడు. వేస్ట్ పరమ వేస్ట్ వరెస్ట్ అంటూ ఓ రేంజ్‌లో ఆడుకుంటూ వచ్చాడు. అయితే అదంతా స్క్రిప్టెడ్ అయినా కూడా బాబా మాస్టర్ దానికి కొంచెం యాడ్ చేసి మరి దుమ్ములేపుతున్నాడు. ఈ క్రమంలో సుధీర్‌పై పదే పదే కించ పరిచే వ్యాఖ్యలు చేస్తూ ఉండటంతో సోషల్ మీడియాలో బాబా మాస్టర్‌పై ట్రోలింగ్ మొదలైంది.
షోలో వీడేం చేస్తున్నాడు.. వీడికి ఎందుకు రెమ్యూనరేషన్ ఇస్తున్నారు? అంటూ ఓ రేంజ్‌లో రచ్చ చేశాడు. అయితే సుధీర్ ఫ్యాన్స్ మాత్రం బాబాను ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు. మా అన్నను అలా అంటావా? అంటూ బాబాను దారుణంగా తిట్టేశారు. అది తిరిగి తిరిగి ఢీ టీం వద్దకు వెళ్లినట్టుంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సుధీర్‌ను బెస్ట్ అంటూ పొగిడేశాడు. దీంతో ఫ్యాన్స్ అందరూ శాంతించారు. అది అలా దిగి రావాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.