టీజర్ టాక్ : కంప్లీట్ హాలీవుడ్ లెవెల్లో “అయలాన్” టీజర్

తమిళ సినిమా దగ్గర ఎప్పుడు నుంచో మంచి హైప్ ఉన్న భారీ చిత్రాల్లో యంగ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా దర్శకుడు ఆర్ రవికుమార్ తెరకెక్కించిన భారీ గ్రాఫికల్ చిత్రం “అయలాన్” కూడా ఒకటి. అయితే ఇండియన్ సినిమా దగ్గర అసలు చాలా తక్కువ టచ్ చేసిన ఏలియన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కించారు.

అయితే అసలు ఈ చిత్రం ఎలా ఉంటుంది ఏలియన్ బ్యాక్ డ్రాప్ లో విజువల్స్ ఎలా ఉన్యి అనేవి కేజ్రీగా మారాయి. మరి ఫైనల్ గా ఈ భారీ సినిమా ఏ లెవెల్లో ఉంటుందో టీజర్ ని ఇప్పుడు విడుదల చేసారు. తమిళ్ మరియు తెలుగులో రిలీజ్ చేసిన ఈ టీజర్ అయితే కంప్లీట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ లో ఉందని చెప్పి తీరాలి.

ప్రపంచం అంతం అయ్యిపోయే నేపథ్యంలో శివకార్తికేయన్ ఉండే ఊరికి ఓ పవర్ ఫుల్ ఏలియన్ వస్తే ఎలా ఉంటుంది, వాళ్ళతో ఆ ఏలియన్ కలిసిపోతే ఎలా ఉంటుంది అనేది అదిరే లెవెల్లో దర్శకుడు ప్రెజెంట్ చేశారు. అయితే ఇందులో బిగ్గెస్ట్ హైలైట్ ఏమన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా సినిమా విజువల్స్ అని చెప్పాలి.

అన్నీ కూడా కంప్లీట్ హాలీవుడ్ స్థాయిలోనే ఉన్నాయి. వీటితో పాటుగా ఏ ఆర్ రెహమాన్ ఇచ్చిన సంగీతం పర్ఫెక్ట్ గా కనెక్ట్ అయ్యేలా ఉందని చెప్పాలి. ఇలా మొత్తంగా అయితే అయలాన్ టీజర్ హాలీవుడ్ లెవెల్లో ఎగ్జైటింగ్ గా ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమా అయితే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుండగా ఇంకా డేట్ అయితే ఖరారు చేయలేదు. పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా విడుదల కాబోతుంది.
Ayalaan (Telugu) - Official Teaser | Sivakarthikeyan, Rakul Preet Singh | A.R. Rahman | R.Ravikumar