బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన అవినాష్ కోసం ఏడ్చేసిన ఇద్దరు ముద్దు గుమ్మలు

avinash eliminated from the bigg boss house on sunday

బిగ్ బాస్ షో యొక్క నాలుగవ సీజన్ ప్రస్తుతం 13వారాలు పూర్తి చేసుకోగా ఆదివారం హౌస్ నుంచి మొత్తం ఎలిమినేషన్ జోన్ లో ఉన్న ఐదుగురులో ‘అవినాష్’ ఎలిమినేట్ అయి బయటకు వెళ్ళిపోయాడు. ఈ వారం జరిగిన ఓటింగ్ ప్రక్రియలో భాగంగా అవినాష్ అలానే మౌనాల్ ల మధ్య తీవ్ర పోటీ జరిగిందని చివరికి మోనాల్ ఒకింత భారీ స్థాయి ఓటింగ్ దక్కించుకుని అవినాష్ వెనకబడటంతో అతడు ఈ రోజు హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడని చెబుతున్నారు.

Avinash and monal

నిజానికి అవినాష్ గత వారమే ఎలిమినేట్ కావాల్సింది. కాకపోతే, ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారా అవినాష్ సేవ్ అయ్యాడు. కానీ, అతను మాత్రం గత వారమే తాను షో నుంచి ఎలిమినేట్ అయిపోయినట్టే ఫీలయ్యాడు. మొత్తానికి ఈ వారం అవినాష్ హౌస్ నుంచి బయటికి వచ్చేశాడు. ఆదివారం నామినేషన్స్‌లో అవినాష్, మోనల్, అభిజీత్, హారిక ఉండగా వీరిలో అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు. అవినాష్ ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించగానే మోనల్ భావోద్వేగానికి గురయ్యింది. కంటతడి పెట్టుకుంది. ఆమెతో పాటు అరియానా కూడా ఏడ్చేసింది.

గతవారం మాదిరిగానే ఈవారం కూడా అవినాష్‌కు అతి తక్కువ ఓట్లు నమోదయ్యాయి. దీంతో అవినాష్‌ను బిగ్ బాస్ ఎలిమినేట్ చేసేశారు. అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అవినాష్ ఎలిమినేట్ కావడంతో హౌస్‌లో ఇంకా మోనాల్, అభిజీత్, హారిక, అఖిల్, అరియానా, సోహెల్ ఉన్నారు. ఈ ఆరుగురు నుంచి వచ్చే వారం ఒకరు ఎలిమినేట్ కానున్నారు. డిసెంబర్ 20న గ్రాండ్ ఫినాలేకు ఐదుగురు కంటెస్టెంట్లు వెళ్లనున్నారు.ఇప్పటికే మరొక రెండు వారాల్లో ఫినాలే షో ఉండడంతో అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. అందుతున్న సమాచారాన్ని బట్టి అతి త్వరలో జరగబోయే ఈ షో యొక్క గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ స్టార్ హీరో ఒకరు ప్రత్యేక అతిథిగా రానున్నట్లు చెప్తున్నారు.