అషు రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లి.. ఏకంగా లక్షల విలువచేసే బ్యాగులను తగలబెడుతూ..!

సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న వారిలో అషు రెడ్డి ఒకరు. ఈమె యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని అనంతరం బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై పలు కార్యక్రమాలు ద్వారా ఎంతో బిజీగా ఉన్నారు. జూనియర్ సమంతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అషు రెడ్డికి సోషల్ మీడియాలో కూడా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Ashu | Telugu Rajyamఇకపోతే ఈమెకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలోని ఎక్కడికి వెళ్లిన ఎంతో ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ లు కొంటూ ఉంటుంది. తాజాగా అషు రెడ్డి దుబాయ్ వెళ్లిన ఈమె లక్షలు విలువ చేసే హ్యాండ్ బ్యాగ్ లను కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే ఒక హ్యాండ్ బ్యాగ్ రెండు లక్షలు మరొకటి రెండున్నర లక్ష ఖరీదు చేసి కొన్నానని తన తల్లికి చూపించడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన ఆమె తల్లి తన పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈక్రమంలోనే అషు రెడ్డినీ ఇష్టానుసారం తిట్టి పడేసింది.

నీకు ఎన్ని సార్లు ఇలా చెప్పినా అర్థం కాదు అంటూ ఇంతకు ముందు కొన్న హ్యాండ్ బ్యాగ్ లను బయటకు వేసి ఏకంగా వాటిని తగలబెట్టింది. దీంతో షాక్ అయిన అషు రెడ్డి ఎందుకమ్మా ఇలా చేస్తున్నావ్ అంటూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంది.ఇక ఇంత ఖరీదు పెట్టి హ్యాండ్ బ్యాగ్ లను కొనడంతో ఎంతో విలువైనదని గ్రహించి బంగారం కొనమంటే కొనలేదని ఇవి కూడా బంగారంతో సమానమేనని వాటిని తీసుకు వెళ్ళి పూజ గదిలో ఉంచి దండం పెట్టుకొని ఇవి కూడా బంగారంతో సమానమేనని చెప్పుకొచ్చారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles