రియల్ లైఫ్ “మళ్ళీ పెళ్లి”..వైరల్ గా సీనియర్ నటుడు పెళ్లి ఫోటోలు.!

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ తన పర్సనల్ లైఫ్ లో షాకింగ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా అన్నట్టుగా లేటెస్ట్ గా చేసిన సినిమా “మళ్ళీ పెళ్లి”. ప్రముఖ నటి పవిత్ర లోకేష్ తో అయితే తాను ఈ వయసులో కూడా డేటింగ్ లో ఉంటూ ఇద్దరూ రిలేషన్ నడపగా నరేష్ రెండో భార్య ఈ అంశంపై ఆ మధ్య వారిద్దరినీ మీడియా ముందు ఎక్స్ పోజ్ కూడా చేశారు.

అయితే ఇప్పుడు నరేష్ పవిత్ర లోకేష్ లు చేసిన “మళ్ళీ పెళ్లి” చిత్రం ఇపుడు రిలీజ్ కి రావడం ఇదే సమయంలో ఇదే ఇన్సిడెంట్ కి కరెక్ట్ గా సెట్ అయినట్టు గా మరో ప్రముఖ నటుడు ఆశీష్ విద్యార్థి తన రెండో పెళ్లి చేసుకొని రావడం సోషల్ మీడియాలో ఓ రకంగా హాట్ టాపిక్ గా మారింది.

అయితే నటుడు ఆశిష్ విద్యార్థి కి ఇప్పుడు 60 ఏళ్ళు కాగా తాను ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవడం ఆసక్తిగా మారింది. ప్రముఖ ఫ్యాషన్ ఎంటర్ ప్యురనర్ అయినటువంటి రూపాలీ బారువా ని అయితే తాను నిన్న వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరు గత కొన్నాళ్ళు నుంచి రిలేషన్ లోనే ఉండగా నిన్న అయితే ఓ రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నారట.

ఈ వివాహానికి గాను ఇద్దరు కుటుంబాలు నుంచి పెద్దలు మాత్రమే వచ్చారట. దీనితో ఈ పెళ్లి అనంతరం వీరి హ్యాపీ మూమెంట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో రియల్ లైఫ్ “మళ్ళీ పెళ్లి” అంటూ ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఆశిష్ విద్యార్థి అయితే ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా “రైటర్ పద్మభూషణ్”, అలాగే అడల్ట్ సిరీస్ “రానా నాయుడు” లలో కీలక పత్రాలు చేశారు.