బాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న షారుక్ ఖాన్ గురించి అందరికీ సుపరిచితమే. ఇకపోతే గత ఏడాది షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ క్రూయిజర్ షిప్ రేవ్ పార్టీలో డ్రగ్ కేసులో భాగంగా ఎన్సీబీ అధికారులకు దొరికిన విషయం మనకు తెలిసిందే. అధికారులు 21 రోజులపాటు ఈయనని కస్టడీలో పెట్టుకున్న అనంతరం ఈయనకు బెయిల్ మంజూరు చేశారు. అనంతరం ఈ కేసులో ఆర్యన్ ఖాన్ కి ఏ విధమైనటువంటి సంబంధం లేదని అధికారులు ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇకపోతే అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది. ఇలా కొడుకును అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేస్తున్న ఈ విషయంపై ఆర్యన్ తల్లి గౌరీ ఖాన్ ఎక్కడ మాట్లాడలేదు.
ఇకపోతే తాజాగా గౌరీ ఖాన్ కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కరణ్ తనని ప్రశ్నిస్తూ ఆర్యన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినప్పుడు మీ కుటుంబం బాధ వర్ణించలేనిది ఈ విషయంపై మీ మాటల్లో చెప్పండి అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు గౌరీ ఖాన్ సమాధానం చెబుతూ నిజంగా ఆ సమయంలో మా కుటుంబ సభ్యులు ఎంతో బాధను అనుభవించారు. ఒక తల్లిగా ఆ బాధను ఒక నరకంలో భావించానని ఈ సందర్భంగా ఈమె తన కొడుకు అరెస్ట్ అయిన సంఘటనను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు.
ఇకపోతే మా ఫ్యామిలీ అలాంటి పరిస్థితులలో ఉన్న సమయంలో ఎంతోమంది తెలియని వాళ్లు కూడా మాకు మెసేజ్లు చేస్తూ, కాల్స్ చేస్తూ ఎంతో ధైర్యం చెప్పారు.ఇలా ఆ క్లిష్ట పరిస్థితులలో మా కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ఈ సందర్భంగా గౌరీ ఖాన్ ఎమోషనల్ అయ్యారు. ఇలా కొడుకు అరెస్ట్ అయిన ఏడాది తర్వాత మొదటిసారి ఈమె తన కొడుకు అరెస్టుపై స్పందించడంతో ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.