చీరకట్టులో కట్టిపడేసిన సురేఖా వాణి.. పిక్ వైరల్

Artist Surekha vani saree pic goes viral

నటి సురేఖా వాణి సోషల్ మీడియాలో చేసే సందడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. వీకెండ్ వస్తే మోడ్రన్ డ్రెస్‌లో దర్శనమిస్తుంటుంది. పబ్, క్లబ్‌లంటూ నైట్ అంతా కూడా పార్టీలు చేసుకుంటూ ఉంటుంది. అలాంటి సురేఖా వాణి అప్పుడప్పుడు చీరలో కూడా మెరుస్తుంటుంది. షూటింగ్ ఉంటే మాత్రం దాదాపు చీరలోనే ఉంటుంది. అయితే తాజాగా సురేఖావాణి ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో చీరకట్టుతో కుర్రకారును కట్టిపడేసింది.

Artist Surekha vani saree pic goes viral
Artist Surekha vani saree pic goes viral

సోషల్ మీడియాలో సురేఖా వాణి ఆమె కూతురు సుప్రిత చేసే సందడికి నెటిజన్లు ఫిదా అవుతుంటారు. తల్లీకూతుళ్లు కాస్తా స్నేహితురాళ్లుగా మారి ఎంజాయ్ చేస్తుంటారు. బీచ్‌లో మందు తాగుతూ కూడా అలా ఇద్దరూ తల్లీ కూతుళ్లు తిరుగుతుంటారు. అంతటి మోడ్రన్ మదర్‌గా సురేఖా వాణిని నెటిజన్లు చూస్తుంటారు. అయితే సురేఖా వాణి తన కూతురిని తెరపైకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తుంటుందని కొందరు కామెంట్లు చేస్తుంటారు.

అయితే సురేఖా వాణి మోడ్రన్, సంప్రదాయ దుస్తుల్లో ఎలా వేరియేషన్స్ చూపిస్తుంటుందో.. తన కూతురితోనూ అలానే చేయిస్తుంటుంది. సుప్రిత కూడా మోడ్రన్ డ్రెస్‌లో కనిపిస్తూనే.. చీరకట్టులో, లంగావోణిలో అదరగొడుతుంది. తాజాగా సురేఖా వాణి షేర్ చేసిన తన ఫోటో వైరల్ అవుతోంది. ఆ చీరకట్టూ, బొట్టూ అన్నీ కూడా నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇది సినిమా షూటింగ్‌లో భాగంగా ధరించిందా? లేదా? అన్నది తెలియదు.