ఇన్సైడ్ టాక్ : “సలార్”లో ఆర్మీ ఎపిసోడ్ మామూలుగా ఉండదట.. 

రానున్న మరికొన్ని రోజుల్లో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర అయితే మరో మాసివ్ బ్లాస్ట్ జరగబోతుంది. మరి ఆ చిత్రమే “సలార్” కాగా దీనిలో ప్రభాస్ హీరోగా నటించగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. మరి ఈ సినిమా విషయంలో కానీ క్వాలిటీ పరంగా మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించగా తమ కంటెంట్ పట్ల కూడా చాలా నమ్మకంగా మేకర్స్ ఉన్నారు.

అయితే ఫస్ట్ ట్రైలర్ కి అంత పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఎక్కడా రాలేదు. దీనితో రెండో ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేస్తారని తెలిసింది. ఇక ఈ సినిమాలో అయితే ఓ కీలకమైన ఎపిసోడ్ కోసం ఇండస్ట్రీ వరాల నుంచి ఓ టాక్ తెలుస్తుంది. దీనితో ఈ సినిమాలో ఆర్మీ నేపథ్యంలో ఒక పన్నెండు నుంచి పదిహేను నిమిషాల మేర ఓ ఫుల్ లెంగ్త్ ఏక్షన్ సీన్ ఉంటుందట.

ఈ సీన్ అయితే మాత్రం సినిమాలో మామూలుగా ఉండదు అని అంటున్నారు. అంతేకాకుండా దీని అవుట్ ఫుట్ కూడా మైండ్ బ్లాకింగ్ గా వచ్చిందని సమాచారం. ఇప్పటికే ప్రభాస్ పాత్ర ఆర్మీ నేపథ్యంలో ఉంటుంది అని మొదటి నుంచీ టాక్ ఉంది.

అలాగే ప్రశాంత్ నీల్ కూడా ఏక్షన్ ఎపిసోడ్స్ తో పేకాట ఆడేస్తాడు. వీటితో సలార్ లో ఆ సీన్ ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. మెయిన్ గా ఇపుడు రెండో ట్రైలర్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఇది ఈ డిసెంబర్ 16 లోపు రావచ్చని సమాచారం. మరి చూడాలి ఈ ట్రైలర్ ఆ ఆర్మీ ఎపిసోడ్ ఎలా ఉంటాయి అనేవి.