బాలీవుడ్ ప్రేమ ప్రయాణాలు ఎవరికి ఓ పట్టాన అర్దం కావు. ఫ్రెండ్షిప్ అంటారు, డేటింగ్ అంటారు, అంతలోనే బ్రేకప్ చెప్పేసి దూరం జరిగిపోతుంటారు. ఇలాంటి సంఘటనలు బాలీవుడ్ లో చాలానే జరిగాయి. అయితే గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వు కేక అనే పాటతో తెలుగు ప్రేక్షకులని కూడా ఆకర్షించిన బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా(47) కొన్నాళ్ళుగా బోని కపూర్ తనయుడు, బాలీవుడ్ కుర్ర హీరో అర్జున్ కపూర్(35)తో డేటింగ్‌లో ఉంది. కొన్నాళ్లు వీరిద్దరి రిలేషన్‌ని సీక్రెట్‌గానే ఉంచిన ఆ తర్వాత బయట పెట్టక తప్పలేదు. లాక్‌డౌన్ సమయంలోను ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉన్నారు. అర్జున్ కపూర్ కు కరోనా రాగా, ఆ వెంటనే మలైకాకు కూడా కరోనా అని నిర్ధారణ అయింది
సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌కు విడాకులు ఇచ్చిన మలైకా కొంత కాలంగా అర్బాజ్ తో డేటింగ్ చేస్తుంది. త్వరలోనే వీరిద్దరు పెళ్ళి చేసుకోవాలని భావిస్తున్నారు.దీనిపై ఇంట్లోనే కాదు బయట కూడా హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. 47 ఏళ్ల వ్యక్తిని ఎలా చేసుకుంటావు అంటూ నెటిజన్స్ కూడా అర్జున్ కపూర్‌కు సలహా ఇస్తున్నారు.ఇక మలైకాని పెళ్లి చేసుకునే విషయంలో అర్జున్ కపూర్ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. ఆమెని చేసుకోవద్దని ఒత్తిడి చేస్తున్నారట. అయిన కూడా ఎవరి మాట వినేది లేదంటున్నాడు అర్జున్
నా మనసు చెప్పింది నేను వింటా. కొన్ని విషయాలలో ఇద్దరి మధ్య వ్యత్యాసం చాలా ఉందని నా కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు . అవన్నీ పట్టించుకునే స్థితిలో ఇప్పుడు నేను లేను అంటూ అర్జున్ అంటున్నాడు. కాగా, అర్జున్ కపూర్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉండగా, మలైకా వైరల్ వీడియోస్‌తో నెటిజన్స్‌ని అలరిస్తూ ఉంటుంది.