ఇది మరీ దారుణం.. అరియానాతో బాబా భాస్కర్ రొమాన్స్

Ariyana Baba Bhaskar Romance In Dance Plus

బాబా భాస్కర్ ఎంత యాక్టివ్‌గా, ఎంత చలాకీగా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఎదుటివారు ఎలా అనుకుంటున్నారు.. ఎలా ఫీలవుతున్నారు.. మనం చేసే కామెడీని ఎలా తీసుకుంటున్నారు అని ఆలోచించడు.. చివరకు ఫన్ వచ్చిందా? లేదా? ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యారా? లేదా? అనేదే చూస్తుంటారు. బాబా భాస్కర్ ఎక్కడుంటే అక్కడంతా సందడి వాతావరణం ఉంటుంది. అలా ఇప్పుడు బాబా భాస్కర్ డ్యాన్స్ ప్లస్ షోలో దుమ్ములేపుతున్నాడు.

Ariyana Baba Bhaskar Romance In Dance Plus
Ariyana Baba Bhaskar Romance In Dance Plus

ప్రేమికుల రోజున సందర్భంగా ఈ షోలో అరియానా అవినాష్ గెస్ట్‌లుగా వచ్చారు. అసలే అరియానా అవినాష్ మధ్య ఏమీ లేదు. ఆ విషయం అందరికీ తెలిసిందే. కానీ స్క్రీన్ మీద మాత్రం ఏదో ఉన్నట్టు క్రియేట్ చేస్తుంటారు. అరియానా మీదు అవినాష్‌కు ఆశలున్నట్టు.. ఆమెను పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉన్నట్టు క్రియేట్ చేస్తుంటారు. ఆమెను ఎవరైనా టచ్ చేసినా, ఫ్లర్ట్ చేసేందుకు చూసినా అవినాష్ ఉడికిపోయినట్టుగా బిల్డప్ ఇస్తుంటాడు.

అలా డ్యాన్స్ ప్లస్ షోలోకి వచ్చిన అరియానాను బాబా భాస్కర్ అమాంతం లేపి ఎత్తుకెళ్లిపోతాడు. స్టేజ్ మీద చుట్టూ చుట్టి వదులుతాడు. ఇక ఆ సమయంలో అవినాష్ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. మేకపిల్ల అనుకుంటున్నారా? మాస్టర్ అలా ఎలా తీసుకెళ్తారు.. అంటూ అవినాష్ ఫైర్ అయ్యాడు. ఇక స్టెప్స్ నేర్పే క్రమంలో బాబా మాస్టర్ అరియానాతో రొమాన్స్ చేస్తుంటాడు. కానీ అవినాష్‌కు మాత్రం ఎక్కడో కాలుతున్నట్టు ఉంటుంది. మొత్తానికి అరియానా బాబా భాస్కర్ రొమాన్స్ మాత్రం పీక్స్‌లో ఉంది.