హీరో జూనియర్ ఎన్టీఆర్ కి ఏపీ సీఎం క్షమాపణలు చెప్పాలి… అసలేం జరిగిందంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యువ నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ విశేషమైన ప్రేక్షకాదరణ సంపాదించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ విధంగా అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ కెరియర్ పరంగా ముందుకు దూసుకెళ్తున్న ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని చాలా మంది అభిమానులు కోరుతున్నారు.

ఎన్టీఆర్ తెలుగుదేశానికి వారసుడిగా ఎంట్రీ ఇస్తేనే పార్టీ. తిరిగి పుంజుకుంటుంది అంటూ అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అయితే తనకు రాజకీయాల్లోకి రావడం ఏమాత్రం ఇష్టం లేదని ఎన్టీఆర్ ఎన్నోసార్లు తెలియజేశారు.అయితే తాజాగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు తెలుగుదేశం పార్టీ నేతలను విమర్శిస్తున్న క్రమంలో ఎన్టీఆర్ పై కూడా నోటి దురుసుగా ప్రవర్తించారు. లోకేష్ బాబు పోతే జూనియర్ ఎన్టీఆర్ లేదా బోనియర్ ఎన్టీఆర్ వస్తాడు అని టీడీపీ నేతలు అంటున్నారు అంటూ మంత్రి అంబటి ఎన్టీఆర్ పై నోరు పారేసుకున్నారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అభిమానులు మంత్రిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు ఏపీ సీఎం జగన్ ఎన్టీఆర్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా వారు #JaganShouldApologizeJrNTR అనే హ్యాష్ ట్యాగ్ ఇండియా వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.