అనుష్క తాజా చిత్రం గ్లింప్స్‌ విడుదల!

అనుష్క శెట్టి తాజా సినిమాకి సంబంధించిన గ్లింప్స్‌ రిలీజ్‌ అయింది. ’కథనార్‌: ది వైల్డ్‌ సోర్సెరర్‌’ టైటిల్‌ తో రానున్న ఓ హారర్‌ సినిమాకి గ్రీన్‌ సిగ్నెల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో జయసూర్య హీరోగా నటిస్తున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్‌ అయిన గ్లింప్స్‌ నెటిజనుల్ని ఆకట్టుకుంటుంది.

కేరళలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా రోజిన్‌ థామస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న చిత్రంలో అనుష్క అరుంధతి తరహాలో రోల్‌ పోషిస్తున్నట్లు సమాచారం. గ్లింప్స్‌ తోనే ఒణుకు పుట్టించారు. అతీంద్రీయ శక్తులు..క్షుద్ర పూజలు..బ్యాక్‌ గ్రౌండ్‌ లో ఆర్‌ ఆర్‌ గ్లింప్స్‌ పై క్యూరియాసిటీని తీసుకొస్తున్నాయి. విజువల్స్‌ ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ చిత్రాన్ని ఏకంగా 14 భాషల్లో రిలీజ్‌ చేయడం విశేషం.

ఆ రకంగా అనుష్క కెరీర్‌ లో ఇదే భారీ విడుదల చిత్రంగా చెప్పొచ్చు. ఇప్పటివరకూ తెలుగు..తమిళ చిత్రాలకే పరిమితమైన అమ్మడి క్రేజ్‌ ఈ సినిమాతో మరింత విస్తరిస్తుంది.