గుణశేఖర్ ” శాకుంతలం ” లో అనుష్క శెట్టి .. ఆరోజు అనౌన్స్‌మెంట్ ..?

అనుష్క నటించిన నిశ్శబ్ధం సినిమా ఇటీవలే ఓటీటీలో రిలీజయిన సంగతి తెలిసిందే. భాగమతి సినిమా తర్వాత అనుష్క నుంచి వచ్చిన నిశ్శబ్ధం లో మూగ, చెవిటి పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుంది. టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి అనుష్క ఒక బ్రాండ్ అన్న పేరుని నిలబెట్టుకుందని మరోసారి అందరి చేత ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకి అనుష్క క్రేజ్ బాగానే ఉపయోగపడి మేకర్స్ కి లాభాలు కూడా వచ్చాయన్న టాక్ వచ్చింది.

Gunasekhar's next titled Shaakuntalam- Cinema express

కాగా అనుష్క ఇప్పటికే రెండు తమిళ సినిమాలని కమిటయిందని కోలీవుడ్ మీడియా సమాచారం. ఆ రెండు సినిమాలు స్టార్ హీరోలు నటించబోతున్నవే అన్న టాక్ వినిపిస్తుంది. వాటిలో ఒక సినిమా సింగం సిరీస్ అని తెలుస్తుంది. సూర్య – దర్శకుడు హరి కాంబినేషన్ లో ఇప్పటికే సింగం సిరీస్ లో 3 సినిమాలు వచ్చి సూపర్ హిట్ గా నిలిచాయి. కాగా ఇప్పుడు 4 భాగాన్ని రూపొందించేందుకు మేకర్స్ సిద్దమవుతుండగా అనుష్క మరోసారి ఈ సినిమాలో సూర్య కి జంటగా నటించనుందట.

Anushka Shetty in Gunasekhar Shakuntalam? | Subhodayam Subbarao

ఇక కమల్ హాసన్ గతంలో నటించిన రాఘవన్ సినిమాకి సీక్వెల్ ని రూపొందించాలని గౌతం మీనన్ ప్లాన్ చేస్తున్నాడన్న వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో కూడా అనుష్క కమల్ కి జంటగా నటించబోతుందట. కాగా నవంబర్ 7 న అనుష్క బర్త్ డే సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రకటనలు రానున్నాయని సమాచారం.

అంతేకాదు ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ “శాకుంతలం” పేరుతో ఒక కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సొంత నిర్మాణ సంస్థ గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా అనుష్క ఇందులో టైటిల్ రోల్ లో నటించబోతుందని అనుష్క బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన భారీ సర్‌ప్రైజ్ రానుందని తెలుస్తుంది.