వైరల్ గా మారిన లేడీ సూపర్ స్టార్ అనుష్క పోస్ట్.!

Anushka-Shetty-marriage-birthday-date-height-age-husband-family-net-worth-imagephotos-details-biography-education-instagram-twitter-wiki-imdb-facebook-youtube-1-1

టాలీవుడ్ సినిమా దగ్గర హీరోల డామినేషన్ ఉన్న సమయంలో ఓ హీరోయిన్ కి కూడా సెపరేట్ గా 40 కోట్ల మేర మార్కెట్ సంపాదించుకోవడం అనేది చిన్న విషయం కాదు. అలాంటి సూపర్ స్టార్డం ని తెచ్చుకున్న ఏకైక హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా అనుష్క శెట్టి అనే చెప్పాలి.

బాహుబలి లాంటి గ్రాండ్ సక్సెస్ లు అందుకున్నా కూడా చాలా సింపుల్ గా ఉంటూ ఎన్నో భారీ ఆఫర్స్ ని కూడా అనుష్క తిరస్కరించింది. తెలుగు సహా తమిళ్ లోనే పలు సినిమాలు చేస్తున్న అనుష్క సోషల్ మీడియాలో కూడా తక్కువగానే యాక్టీవ్ గా ఉంటుంది. అలా ఉన్నప్పటికీ లేటెస్ట్ గా ట్విట్టర్ లో అయితే 1 మిలియన్ ఫాలోవర్స్ ని తాను టచ్ చేసింది.

దీనితో 10 లక్షల మంది ఫ్యామిలీ తాను సొంతం చేసుకోవడంతో ఓ బ్యూటిఫుల్ పిక్ పెట్టి అందరికీ ధన్యవాదాలు తెలిపింది. దీనితో చాలా కాలం తర్వాత అనుష్క నుంచి కొత్త పిక్ రావడంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. దీనితో అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఇప్పుడు అయితే అనుష్క యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తో “మిస్ పొలిశెట్టి మిసెస్ పొలిశెట్టి” అనే ఇంట్రెస్టింగ్ సినిమాలో నటిస్తుంది. దీనిపై కూడా మంచి అంచనాలు ఉండగా అతి త్వరలోనే ఈ సినిమాని మేకర్స్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తుండగా తెలుగు సహా తమిళ్ లో ఈ సినిమా రిలీస్ కాబోతుంది.