Anushka Shetty: అనుష్క నెక్ట్స్ చిత్రం ఖరారు.. మళ్లీ ఆ బ్యానర్‌లోనే… షూటింగ్ ప్రారంభమయ్యేది అప్పుడే?

Anushka Shetty: టాలీవుడ్‌లో అనుష్క అనే పేరు తెలియని వారుండరు. ఎందుకంటే లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద విజయ దుంధుభి మోగిస్తాయని నిరూపించిన స్టార్ హీరోయిన్. అరుంధతి, భాగమతి లాంటి సినిమాలతో సౌత్ ఇండియ‌న్ నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్‌గా కొన్నేళ్ల పాటు చ‌క్రం తిప్పి, ది బిస్ట్ హీరోయిన్‌గా కూడా పేరు తెచ్చుకుంది. అంతే కాదు ప్రభాస్ సరసన రెండు సినిమాల్లో నటించి, తమ కెమిస్ట్రీతో తెలుగు పరిశ్రమలో బెస్ట్ కపుల్ జోడీగా నిలిచింది ఈ భామ. మిర్చి, బాహుబలి లాంటి సినిమాలు చాలా మందికి ఇప్పటికీ ఫెవరెట్‌ లిస్ట్‌లో ఉన్నాయంటే ఆ మూవీస్ అప్పట్లో ఎంత క్రేజ్‌ను సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవ‌స‌రం లేదు. ఇక తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లిన బాహుబలి సినిమా, ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదనే చెప్పాలి. ఇలా తాన నటనతో, క్యూట్ స్మైల్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న స్వీటీ ప్రస్తుతం సినిమాల్లో కనిపించకపోయే సరికి, ఆమె ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురవుతున్నారని సమాచారం.

అయితే ఇటీవల రిలీజైన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా భారీ సక్సెస్‌ను సాధించి, ఎన్నో రికార్డ్స్‌ను బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఆ తర్వాత జరిగిన చరణ్ బర్త్‌డే ఫంక్షన్‌లో అనుష్క తళుకుమంది. రాజమౌళి ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆమె ఆ పార్టీకి వచ్చినట్టు తెలిస్తోంది. ఇక చాలా రోజుల తర్వాత మళ్లీ స్వీటీకి సంబంధించిన ఓ వార్త వచ్చేసరికి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఆమె బాగమతి సినిమా తర్వాత మళ్లీ ఏ సినిమాలోనూ నటించలేదు. అయితే ఈ మధ్య మాత్రం ఆమె పలు సినిమాల్లో నటిస్తుంది అనే వార్తలు చక్కర్లు కొడుతుండగా, అఫిషియల్ గా మాత్రం ఎలాంటి ప్రకటనా రాలేదు.

ఇక వివరాల్లోకి వెళితే ఇదే విషయంపై తాజాగా ఓ అప్‌డేట్ వచ్చినట్టు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ సంస్థ బ్యానర్‌లో దర్శకుడు మహేశ్‌బాబు. పి డైరెక్ట్ చేస్తున్న ఓ చిత్రంలో ఆమె నటిస్తున్నట్టు ఓ ప్రకటన వెలువడింది. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి కూడా ఉన్నట్టు సమాచారం. కాగా ఈ మూవీకి ఇప్పటివరకూ ఎలాంటి టైటిల్ ఫిక్స్ కాలేదు. ఇక అనుష్క ఇంతకుముందు నటించిన మిర్చి, భాగమతి సినిమాలు కూడా యూవీ బ్యానర్స్‌లో వచ్చినవే. దాంతో ఏప్రిల్ 4నుంచి షెడ్యూల్ ప్రారంభం కాబోతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నమోదవుతున్నాయి.