గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు చేస్తున్న పలు చిత్రాల్లో అయితే తన హిట్ అండ్ ఫ్యాన్ దర్శకుడు హరీష్ శంకర్ తో పవన్ చేస్తున్న కాప్ ఏక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. మరి దర్శకుడు ఈ చిత్రాన్ని తేరి రీమేక్ అనే డౌట్ కూడా రాకుండా టేక్ చేసిన విధానం అయితే ఆడియెన్స్ లో ఆసక్తి రేకెత్తించింది.
ఇక ఈ చిత్రం నుంచి వచ్చిన సాలిడ్ గ్లింప్స్ మరింత హైప్ ని రేపగా ఈ చిత్రంతో మొదటిసారి పవన్ మరియు లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ శ్రీ లీల నటిస్తుంది. ఇక ఈ చిత్రంలో ఈ యంగ్ హీరోయిన్ తో పాటుగా మరో లేటెస్ట్ యంగ్ బ్యూటీ కూడా నటిస్తున్నట్టుగా సినీ వర్గాల్లో లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.
కాగా ఈ హీరోయిన్ అయితే అఖిల్ అక్కినేని తో ఎంట్రీ ఇచ్చిన సాక్షి వైద్య అయితే ఈ చిత్రంలో ఓకే అయ్యినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి నిజంగానే ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారా లేక ఒకరేనా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
మరి ఇప్పటికే సినిమా బాగా లేట్ అవుతుంది మళ్ళీ పవన్ డేట్స్ ఇచ్చేవరకు స్టార్ట్ అయ్యే పరిస్థితి కూడా లేదు. మరి చూడాలి ఏమవుతుంది అనేది. కాగా ఈ చిత్రానికి అయితే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో భారీ సెట్టింగ్స్ నడుమ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.
