సుశాంత్ సింగ్ కేసు: ఇంట్లోవాళ్లకి తెలిసినా సుశాంత్ గురించి ఇదంతా ఎందుకు దాచారు?

Another twist in sushant singh rajput death

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు ఎన్నో మలుపులను తిరుగుతోంది. ముందుగా ఆయనది ఆత్మహత్య అని అందరూ అనుకున్నారు. కానీ.. కేసులో ఎన్నో ట్విస్టులు. అది హత్య.. అంటూ కొందరు ఆరోపించడం.. ఏకంగా సుశాంత్ తండ్రే… తన కొడుకు చనిపోవడానికి సుశాంత్ ప్రేయసి రియా కారణమంటూ చెప్పడంతో కేసు దారితప్పింది.

Another twist in sushant singh rajput death
Another twist in sushant singh rajput death

దీనిపై సుశాంత్ తండ్రి కేకే సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసును ముందుగా ఈడీ డీల్ చేసింది. రియాను విచారించింది. తన కాల్ డేటాను కూడా విశ్లేషించింది. ఆ తర్వాత ఈ కేసు సీబీఐకి బదిలీ అయింది. ప్రస్తుతం సీబీఐ ఈ కేసును విచారిస్తోంది.

సుశాంత్ కు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని… కేవలం రియా వల్లనే సుశాంత్ మరణించాడంటూ కుటుంబ సభ్యులు ఓవైపు ఆరోపిస్తున్నారు. సుశాంత్ కు డిప్రెషన్ లాంటి సమస్య కూడా లేదని వాళ్లు స్పష్టం చేస్తున్నారు.

అసలు సుశాంత్ చనిపోవడానికి, డిప్రెషన్ కు సంబంధమే లేదు.. అని అంటున్న నేపథ్యంలో సుశాంత్ సోదరికి చెందిన వాట్సప్ చాట్ కు సంబంధించిన ఓ స్క్రీన్ షాట్ ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. అందులో సుశాంత్ చాలా టెన్షన్ పడుతున్నట్టుగా ఉండటం… సుశాంత్ ఆందోళనలో ఉన్నాడని.. ఆయన వేసుకోవాల్సిన ట్యాబెట్ల విషయం కూడా అందులో ప్రస్తావించారు.  సుశాంత్ డిప్రెషన్ తగ్గేందుకు ఏ మందులు వాడాలో దానికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ ను సుశాంత్ సోదరి వాట్సప్ చేసింది. అంటే.. సుశాంత్ డిప్రెషన్ తో బాధపడుతున్నాడని.. ఆయన కుటుంబ సభ్యులందరికీ తెలుసు.. అనే విషయం ఇప్పుడు వైరల్ అవుతున్న వాట్సప్ చాట్ స్క్రీన్ షాట్ ద్వారా తెలిసిపోతోంది.

అయితే.. సుశాంత్ డిప్రెషన్ లో ఉన్నాడు.. అనే విషయం వాళ్లకు ముందే తెలిసినా.. సుశాంత్ ను ఎందుకు ఆయన కుటుంబ సభ్యులు జాగ్రత్తగా చూసుకోలేకపోయారు. ఇవన్నీ తెలిసి కూడా.. సుశాంత్ కు డిప్రెషన్ లేదని.. కేవలం రియా వల్లనే చనిపోయాడంటూ.. రియా మీద నేర మోపుతున్నారు.. అంటూ రియా అభిమానులు మండిపడుతున్నారు.

కావాలని రియాను ఈ కేసులో ఇరికించేందుకు సుశాంత్ కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని.. వాళ్లు ఆరోపిస్తున్నారు. రియాకు న్యాయం జరగాలని.. తనకు ఏ తప్పూ తెలియదని.. జస్టిస్ ఫర్ రియా పేరుతో హ్యాష్ టాగ్ ను ట్రెండింగ్ చేస్తున్నారు.

సుశాంత్ సోదరి చాట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్.. సీబీఐ ఎంక్వయిరీలో బయటపడింది. దీంతో ఇప్పుడు అసలు విషయం బయటపడింది. చూద్దాం.. ఇంకా ఏ విషయాలు మున్ముందు తెలియనున్నాయో?