మరో షాకింగ్ : మరోసారి హాస్పిటల్ లో ప్రభాస్ “ప్రాజెక్ట్ కే” హీరోయిన్.?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు సహా హిందీ ఇంగ్లీష్ లెవెల్ సినిమాలు తాను చేస్తున్నాడు. మరి అలా తాను అయితే పాన్ వరల్డ్ లెవెల్లో చేస్తున్న లేటెస్ట్ సినిమా “ప్రాజెక్ట్ కే” కోసం అందరికీ తెలిసిందే.

దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ తో కలిసి సుమారు 50 శాతం మేర షూటింగ్ లో ఆమె అయితే పాల్గొంది. అయితే ఇప్పుడు ఈమెకి సంబంధించి అయితే బాలీవుడ్ మీడియా వర్గాల నుంచి షాకింగ్ వార్తలు వినిపిస్తున్నాయి.

గత కొన్నాళ్ల కితం దీపికా కి కొద్ది పాటి అస్వస్థత మూలాన హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. మరి మళ్ళీ తనకి అయితే ఆరోగ్యం పరంగా సమస్యలు వచ్చినట్టు తెలుస్తుంది. దీనితో మళ్ళీ ఆమె హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యింది అని కొన్ని హెల్త్ చెకప్స్ కోసం వెళ్లినట్టు చెబుతున్నారు.

దీనితో అయితే ఇప్పుడు మళ్ళీ దీపికా ఆరోగ్యం విషయంలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అయితే బాలీవుడ్ వర్గాలు సరైన క్లారిటీ కోసం చూస్తున్నారు. ఇంకా దీపికా అయితే ఇప్పుడు ప్రభాస్ తో పాటుగా బాలీవుడ్ లో కూడా పలు భారీ సినిమాలు చేస్తుంది.