బాలీవుడ్ లో గత రెండేళ్ళ నుంచి హీరోలు అందరికి కూడా ఫ్లాప్ లు ఎక్కువ వస్తున్నాయి. బడ్జెట్ ని వందల కోట్లలో పెడుతున్నారు. అయితే వాటి కలెక్షన్స్ మాత్రం కనీసం వంద కోట్లు కూడా అందుకోవడం లేదు. స్టార్ హీరోల సినిమాలు కూడా డిజాస్టర్ అవుతున్నాయి. కేవలం ఎమోషనల్ ఎలిమెంట్స్ లేకుండా కమర్షియల్ కోణంలో బలమైన కథ, కథనం లేకుండా సినిమాలు చేయడం వలనే బాలీవుడ్ సినిమాలు ఎక్కువగా ఫ్లాప్ అవుతున్నాయి అనే మాట ఇప్పుడు బిటౌన్ లో వినిపిస్తుంది.
బాలీవుడ్ లో గ్యాప్ లేకుండా అందరికంటే ఎక్కువ సినిమాలు చేస్తున్న స్టార్ హీరోల జాబితా చూసుకుంటే అక్షయ్ కుమార్ ముందు వరుసలో ఉంటారు. గత ఏడాది ఏకంగా ఆరు సినిమాలని అయన ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. అయితే వాటిలో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకులని ఆకట్టుకోలేదు. బచ్చన్ పాండే మూవీ డిజాస్టర్ అయ్యింది. గద్దలకొండ గణేష్ మూవీకి రీమేక్ గా ఇది తెరకెక్కింది. సామ్రాట్ పృద్వీరాజ్ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఈ మూవీలో ఎలాంటి ఎమోషనల్ ఎలివేషన్ లేకపోవడం ఫ్లాప్ అయ్యింది.
తరువాత రక్షా బంధన్ మూవీ కూడా సిస్టర్స్ సెంటిమెంట్ తో వచ్చిన ఫ్లాప్ అయ్యింది. రాచ్చసన్ రీమేక్ గా వచ్చిన కుట్పుటిల్లి మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది. ఇక రామ్ సేతు కూడా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయ్యింది. ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ తోనే తెరకెక్కించిన ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. ఇదిలా ఉంటే తాజాగా రిలీజ్ అయిన సెల్ఫీ మూవీ కూడా అక్షయ్ కుమార్ ఖాతాలో మరో డిజాస్టర్ గా చేరినట్లే కనిపిస్తుంది. ఇక ఈ ఏడాదిలోనే సూరైపోట్రు రీమేక్ తో పాటు హో మై గాడ్ సీక్వెల్ కూడా ఉంది.
ఆ సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో అనేది వేచి చూస్తున్నారు. ఇదిలా ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ మూవీకి రీమేక్ గా హిందీలో సెల్ఫీ తెరకెక్కింది. అయితే ఈ మూవీ మొదటి రోజు ఎలాంటి బజ్ లేకపోవడంతో కేవలం 3.75 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. నిజంగా అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోకి ఇది డిజాస్టర్ ఓపెనింగ్ అని చెప్పాలి. ఇప్పటి వరకు 6.35 కోట్లు కలెక్ట్ చేసింది. మొదటి వారంలో ఈ మూవీ పది కోట్లు అయినా కలెక్ట్ చేస్తుందో లేదో అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. మరి దీంతో అక్షయ్ కుమార్ ఖాతాలో మరో ఫ్లాప్ పడినట్లే అనే టాక్ నడుస్తుంది.