తెలుగు బుల్లితెరపై దశాబ్దకాలంగా కొనసాగుతున్న కమెడియన్ షో జబర్దస్త్. అయితే ఈ జబర్దస్త్ కార్యక్రమాన్ని బీట్ చేయాలి అని చాలా చానల్స్ అనేక రకాలుగా ప్రయత్నం చేశాయి. ఇప్పటికీ ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. కామెడీ తరహా షోలతో జబర్దస్త్ లో బీట్ చేయాలి అని చేస్తున్న ప్రయత్నాలు ఏ ఒక్కటి కూడా సఫలం కావడం లేదు. కామెడీ షో, అదిరింది లాంటి షోలు జబర్దస్త్ ను బీట్ చేయాలని పోటీ పడ్డాయి. ఇక బీట్ చేయడం సంగతి పక్కన పెడితే దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ఇకపోతే మా టీవీ వారు జబర్దస్త్ కి పోటీగా కామెడీ స్టార్స్ ను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ కామెడీ స్టార్స్ షోని అనేక విధంగా మార్పులు చేర్పులు చేసి వచ్చినప్పటికీ జబర్దస్త్ షోని బీట్ చేయలేకపోయారు. అంతేకాకుండా ఈ కామెడీ స్టార్స్ షోలో జబర్దస్త్ జడ్జ్ నాగబాబు కూడా కూర్చోబెట్టారు. అయినా కూడా ఈ షో జబర్దస్త్ లోకి వస్తున్న రేటింగ్ లో కనీసం సగం రేటింగ్ కూడా సంపాదించడం లేదు. దీనితో నాగబాబు తో పాటు కామెడీ స్టార్స్ లో ఉన్న టీంలు కూడా దిగులు చెందుతున్నారట. మామూలుగా స్టార్ మా టీవీలో ఏషో అయినా 5 నుంచి 7 వారాలు చూసి రేటింగ్ లేకపోతే మూసివేయడం చేస్తూ ఉంటారు. కానీ కామెడీ స్టార్స్ మాత్రం ఇప్పటికే ఎక్కువగా ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
అయితే ఇప్పటికే చాలా వారాలుగా కామెడీ స్టార్స్ షోని కొనసాగిస్తూ వస్తున్నప్పటికీ రేటింగ్ మాత్రం పెరగడం లేదు. దీనితో స్టార్ మా వాళ్ళు కామెడీ స్టార్స్ షోకి మరొక ఆరు వారాలు గడువు ఇచ్చారట. ఆరు వారాల తర్వాత రేటింగ్ బాగుంది డబ్బులు భారీగా వస్తే కొనసాగించేదే లేకపోతే లేదు అంటూ గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారట. జడ్జ్ నాగబాబు కూడా ఈ విషయంలో ఏమి చేయలేని పరిస్థితి. మరి ఈ ఆరు వారాలలో రేటింగ్ వచ్చి ఈ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుందా? లేకపోతే ఫ్లాప్ అవుతుందా చూడాలి మరి.