అంజనా దేవి ఆరోగ్యంపై.. క్లారిటీ ఇచ్చిన నాగబాబు.. ఏమయ్యిందంటే..!

మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి ఆరోగ్యం బాగలేదన్న వార్తలు మంగళవారం పలు సోషల్ మీడియా వేదికల్లో హల్‌చల్‌ చేశాయి. కొణిదెల కుటుంబ పెద్దగా నిలిచిన అంజనా దేవి అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ వచ్చిన వార్తలు అభిమానుల్లో ఆందోళన రేపింది. ముఖ్యంగా ఆమె తల్లి ఆరోగ్యం విషమమైందన్న ప్రచారంతో పవన్ కళ్యాణ్ హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారంటూ కథనాలు చక్కర్లు కొట్టాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు ట్విటర్ (ఎక్స్‌) వేదికగా స్పందించారు. “అమ్మ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. తప్పుడు వార్తలను నమ్మొద్దు” అంటూ స్పష్టత ఇచ్చారు. కొన్ని అనధికారిక వర్గాల నుంచి వస్తున్న అసత్య ప్రచారాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు.

చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ తల్లి వావడంతో.. ఆమె ఆరోగ్యంపై అభిమానుల్లో అపార ఆసక్తి ఉంది. కొంతకాలం క్రితం ఆమె 75వ పుట్టినరోజు కుటుంబసభ్యుల మధ్య ఘనంగా జరిపారు. ప్రస్తుతం ఆమె చిరంజీవి నివాసంలో హాయిగా విశ్రాంతి జీవితం గడుపుతున్నారు.

మెగా కుటుంబ వర్గాల సమాచారం ప్రకారం, ఆమె తన మనవరాలు క్లీంకారతో కలిసి ఆనందంగా గడుపుతూ, ఆరోగ్యంగా ఉన్నారు. ఆమె ఆరోగ్యంపై వస్తున్న పుకార్లు అసత్యమని, వాటిని నమ్మకండని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అభిమానులు కూడా సామాజిక మాధ్యమాల్లో ఉన్న దుష్ప్రచారాన్ని నమ్మకూడదని, అధికారిక వర్గాల ప్రకటనలకే విశ్వాసం ఇవ్వాలని కోరుతున్నారు.