ఆ పాత్ర కోసం చాలా కష్టపడ్డాను:అంజలి

anjali as police in nissabda,

అంజలి, తమిళ చిత్రాలైన సింధుబాద్ మరియు నాడోడిగల్ 2 సినిమాల కోసం జిమ్‌ కు వెళ్తున్న సమయంలోనే ఆమెకు తెలుగు చిత్రం నిషబ్ధం (సైలెన్స్ ఇన్ తమిళం, మలయాళం మరియు హిందీ) లో పోలీసు అయిన మహా పాత్ర వచ్చింది. ఈ పోలీస్ పాత్ర కోసం , ప్రతిరోజూ మూడు గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు కసరత్తులు చేస్తు మరియు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటూ కఠినమైన ఈ వ్యవహారాలకి కట్టుబడి ఉండేదానినని, “దాదాపు ఒక నెల పాటు నేను గుడ్డులోని తెల్లసొన తీసుకుంటూ ఆ పాత్ర కోసం పరిపూర్ణంగా కనిపించడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను ”అని అంజలి చెప్పారు.

anjali as police in nissabda,
anjali as police in nissabdam

దర్శకుడు హేమంత్ మధుకర్ యొక్క ఈ థ్రిల్లర్ లో అనుష్క శెట్టి,అంజలి, ఆర్ మాధవన్ మరియు హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడ్సెన్ ముఖ్యమైన పాత్రలలో కనిపించబోతున్నారు. . “ నా పాత్ర గురించి చెప్పినప్పుడు ఈ సినిమాకు నో చెప్పడానికి నాకు కారణం లేదు. నేను స్టైలిష్ పోలీసుగా ఎందుకు ప్రయత్నించకూడదని అనుకుని ఆ పాత్రని చేశానని అంజలి చెప్పారు.

యాక్షన్ సన్నివేశాల కోసం మరియు అమెరికన్ పోలీస్ యొక్క బాడీ లాంగ్వేజ్ కోసం ఆమెకు హాలీవుడ్ బృందం శిక్షణ ఇచ్చింది. వారు ఆమె పాత్ర యొక్క కథను పరిగణనలోకి తీసుకుని – పోలీసు విభాగంలో క్రైమ్ డిటెక్టివ్‌గా ఆమె ఎలా ఉండాలో : “ప్రతి రోజు 4 నిమిషాల నుండి గంట వరకు శిక్షణ ఇస్తూ హాలీవుడ్ బృందం మార్గనిర్దేశం చేస్తూ ,మాట్లాడే విధానం, నడవడం, పట్టుకోవడం లేదా తుపాకీ కాల్చడం, పరిగెత్తడం…వంటి అనేక అంశాల గురించి చెప్పడం వల్లనే ఈ పాత్రకి న్యాయం చేశానని తెలియచేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబర్ 2 న నిశబ్దం విడుదల అవుతుంది .