బాక్సాఫీస్ బ్లాస్ట్ : రెండు రికార్డ్ క్లబ్స్ లోకి “ఆనిమల్”..!

ఈ ఏడాదికి బాలీవుడ్ సినిమా దగ్గర వచ్చిన పలు భారీ హిట్ చిత్రాల్లో ఇప్పుడు ఓ రేంజ్ లో వినిపిస్తున్న సెన్సేషనల్ చిత్రం పేరు “ఆనిమల్” కూడా ఒకటి. మరి ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చిన ఈ చిత్రం 1 డిసెంబర్ న విడుదల అయ్యి హిందీ మార్కెట్ లో సంచలన రికార్డులు వసూళ్లతో సెట్ చేసింది.

కాగా వరల్డ్ వైడ్ వసూళ్లలోనే కాకుండా యూఎస్ వసూళ్లు కూడా రికార్డు మార్క్ ని నిన్న ఫ్రైడే వసూళ్లతో ఈ సినిమా అందుకుంది. కాగా ఈ చిత్రం ఈ 8 రోజుల్లో అయితే ఏకంగా 600 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిపోయింది. ఇక యూఎస్ మార్కెట్ లో అయితే ఈ సినిమా 10 మిలియన్ డాలర్స్ క్రాస్ చేసి అక్కడా మరో రికార్డు మైల్ స్టోన్ ని రీచ్ అయ్యింది.

దీనితో జస్ట్ 8 రోజుల్లోనే ఆనిమల్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఒక బ్లాస్ట్ గా నిలిచింది అని చెప్పాలి. మరి యూఎస్ లో అయితే ఈ చిత్రం 10 మిలియన్ డాలర్స్ తో ఇండియన్ సినిమా నుంచి ఈ మార్క్ అందుకున్న 7వ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది అని చెప్తున్నారు.

మొత్తానికి అయితే ఆనిమల్ సక్సెస్ మాత్రం వేరే లెవెల్లో ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమాని తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించగా రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. అలాగే బాబీ డియోల్ మరియు త్రిప్తి దిమిరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.