బాక్సాఫీస్ : వరల్డ్ వైడ్ “ఆనిమల్” 11 రోజుల కలెక్షన్స్ ఎంతంటే 

లేటెస్ట్ గా బాలీవుడ్ సినిమా నుంచి రిలీజ్ అయ్యిన చిత్రం “ఆనిమల్” సృష్టిస్తున్న హవా అంతా ఇంతా కాదు. బాలీవుడ్ సహా ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ఒక ఏ సర్టిఫెక్ట్ సినిమాతో ఏకంగా 700 కోట్లకి పైగా వసూళ్ళని కొల్లగొట్టే సినిమాని మన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించాడు.

కాగా ఈ చిత్రంలో హీరోగా బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా నటించగా హీరోయిన్ గా రష్మికా మందన్నా అయితే నటించింది. మరి ఈ కలయికలో వచ్చిన ఈ సినిమా డే 1 నుంచే సంచలన వసూళ్లు అందుకోగా ఇపుడు సక్సెస్ ఫుల్ లో రెండో వర్కింగ్ డే రెండో సోమవారం రన్ ని బాక్సాఫీస్ దగ్గర కంప్లీట్ చేసింది.

మరి ఈ చిత్రం ఇండియా వైడ్ గా కూడా 15 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకోగా హిందీ నుంచి అయితే 13 కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకుంది. అయితే ఈ 11 రోజుల్లో ఈ చిత్రం మాత్రం వరల్డ్ వైడ్ గా సుమారు 738 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి దూసుకెళ్తుంది. దీనితో ఇక నెక్స్ట్ స్టాప్ 800 కోట్ల క్లబ్ అనే అనిపిస్తుంది.

దీనిని ఈ వారంతో ఈ సినిమా అందుకోవచ్చు. మొత్తానికి అయితే ఇలా ఓ మూడున్నర గంటల సినిమాతో ఈ స్థాయి వసూళ్లు ఈ సినిమా అందుకుంటుంది అని మాత్రం చాలా మంది ఊహించి ఉండకపోవచ్చు. కానీ దీనిని సందీప్ అండ్ టీం నిజం చేసి చూపించారు. ఇక ఫైనల్ రన్ గా ఈ సినిమా ఎక్కడ ఆగుతుందో అనేది కూడా చాలా మందిలో ఆసక్తిగా నెలకొంది.