ఈ మధ్య కాలంలో కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ మూడు గంటల సినిమా అయినా కూడా థియేటర్స్ లో కూర్చొని ఆ సినిమాలు ఎంజాయ్ చేస్తున్నారు. దీనితో డైరెక్టర్ లు కూడా ఎలాంటి డౌట్ లేకుండా తమ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. కాగా అలా ఈ మధ్య కాలంలో వచ్చిన చిత్రాలు కొన్ని RRR, పుష్ప, విక్రమ్ సహా ఎన్నో సినిమాలు భారీ రన్ టైం తో వచ్చినా సక్సెస్ అయ్యాయి.
అయితే ఇవే ఒకెత్తు అనుకుంటే తన సినిమా “ఆనిమల్” ఏకంగా 3 గంటల 21 అంటూ దర్శకుడు సందడీపీ రెడ్డి వంగ బాంబు పేల్చాడు. అంతసేపు ఓకే కానీ ఒకవేళ సినిమా బాగాలేకపోతే పరిస్థితి ఏంటి అని చాలా మంది అంటున్నారు. అయితే దీనికి దర్శకుడు సాలిడ్ ఆన్సర్ ఇచ్చాడు. తన గత సినిమా అర్జున్ రెడ్డి 3 గంటల 6 నిమిషాలు. అది కేవలం ఇద్దరి ప్రేమ కథ. కానీ ఆనిమల్ లో ఒక ఫ్యామిలీ ఉంది ఏక్షన్ ఉంది అనేక లేయర్స్ ఉన్నాయి.
సో అందుకు ఈ మూడు గంటల 21 నిముషాలు పర్ఫెక్ట్ గా సరిపోతుంది అని సందీప్ వెల్లడించాడు. తాను అయితే తన సినిమా పట్ల చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు కానీ ఏమన్నా తేడా జరిగితే పరిస్థితి ఏంటి అనేది చూడాలి. కాగా ఈ అవైటెడ్ సినిమాలో రణబీర్ కపూర్, రష్మికా మందన్నా హీరో హీరోయిన్స్ గా నటించగా ఈ చిత్రం రిలీజ్ పాన్ ఇండియా భాషల్లో ఈ డిసెంబర్ 1న రిలీజ్ కాబోతుంది.