యాంకర్ విష్ణుప్రియకు అడ్వెంచర్స్, ట్రావెలింగ్ అంటే ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. ప్రయాణాలు చేయడం అంటే తనకు ఎంతో ఇష్టమని ఎన్నో సార్లు బయటకు చెప్పుకొచ్చింది. ఆ విషయాన్నే తన ప్రాణ స్నేహితురాలైన శ్రీముఖి సైతం ఎన్నో ఇంటర్వ్యూల్లోచెప్పింది. అయితే తాజాగా విష్ణుప్రియ సముద్రంలో అలా తేలిపోయింది. అయితే విష్ణుప్రియకు స్విమ్మింగ్ రానట్టు కనిపిస్తోంది. మామూలుగా విష్ణుప్రియ, శ్రీముఖి ఆ మధ్య మాల్దీవుల్లో చేసిన రచ్చ అందరికీ తెలిసిందే.
శ్రీముఖి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక.. అందరూ కలిసి మాల్డీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఇంట్లో ఫ్రస్ట్రేషన్ విన్నర్ కాలేదన్న బాధ ఇలా అన్నింటిని తీసుకోవడానికి తన మిత్రబృందంతో కలిసి శ్రీముఖి అక్కడికి వెళ్లింది. అందులో విష్ణుప్రియ కూడా ఉందన్న సంగతి తెలిసిందే. శ్రీముఖి, విష్ణుప్రియ ఇద్దరూ కలిసి చేసిన డ్యాన్సులు తెగ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా విష్ణుప్రియ ఒంటరిగానే వెళ్లినట్టుంది.
విష్ణుప్రియ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో విష్ణుప్రియ మునిగిపోకుండా ఉండేందుకు ఉపయోగించే జాకెట్‌ను ధరించింది. పూర్తిగా మునగకుండా అలా పట్టుకుని నీళ్లలోనే తేలియాడుతోంది. ఇక తన స్నేహితులు ఫోటోలు, వీడియోలు తీస్తుంటే వెరైటీగా పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. బుల్లితెరపై యాంకర్‌గా ఉన్న విష్ణుప్రియ హీరోయిన్‌గా వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకున్న సంగతి తెలిసిందే. కానీ ఫలితం మాత్రం బెడిసి కొట్టేసింది.