యాంకర్ విష్ణు ప్రియ షార్ట్ ఫిలిమ్స్‌తో బాగానే ఫేమస్ అయింది. అలా అక్కడి నుంచి బుల్లితెరపై బాగానే సెటిలైంది. చిన్నప్పటి నుంచి నటి అవుదామని కలలుగన్న తాను అనుకోకుండా ఇలా యాంకరింగ్ ఫీల్డ్‌లోకి వచ్చానని చెప్పింది. పోవే పోరా ఆడిషన్స్‌లో సెలెక్ట్ అవ్వడంతో ఇలా యాంకర్ అయ్యానని చెప్పుకొచ్చింది. చిన్నప్పుడు హీరోయిన్ల ఇంటర్వ్యూలు చూస్తున్నప్పుడు.. అటు సైడ్ ఉంటానా? ఇటు సైడ్ ఉంటానా? అని చాలా అనుకున్నానని ఆ మధ్య విష్ణుప్రియ తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చింది.
తాజాగా ఈ మధ్య బిగ్ బాస్ షోపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ అంటే ఇష్టం ఉండదు.. అలాంటి షోకి డబ్బులు ఇస్తున్నారంటే ఎందుకు పోతా.. లక్షలు కాదు.. ఎన్నికోట్లు ఇచ్చినా తాను బిగ్ బాస్ షోకి కంటెస్టెంట్‌గా వెళ్లనని కుండ బద్దలు కొట్టేసినట్టు చెప్పింది. తాను బిగ్ బాస్ పర్సన్‌ని కాదని.. చిన్నప్పటి నుంచి కూడా తాను బిగ్ బాస్ షో చూడలేదని తెలిపింది. ఇలాంటి షోని తాను ఎంకరేజ్ చేయనని… ఆ షోలో కొట్టుకోవడాలు.. ఎలిమినేషన్‌లు.. తనకు ఇష్టం ఉండదని చెప్పుకొచ్చింది.
తాజాగా విష్ణు ప్రియ ఓ పోస్ట్ చేసింది. అందులో పరిశీలిస్తే తాను చాలా సార్లు తిరస్కరణకు గురైనట్టు.. అవన్నీ తనకు కామన్ అయినట్టు తెలుస్తోంది. తన ఇన్ స్టాగ్రాంను వెరిఫై చేసుకోవడంలో చాలా సార్లు తిరస్కరణకు గురైనట్టు.. మొత్తానికి అధికారిక ఖాతాగా టిక్ మార్క్ వచ్చిందని తెలిపింది. ఈ మేరకు విష్ణు ప్రియ చెబుతూ.. రిజెక్షన్స్ నాలో పాజిటివిటీని పెంచుతాయి.. అలా రిజెక్షన్లు జరిగితేనే అది విష్ణుప్రియ అని నాకు తెలుసు. అలాంటి రిజెక్షన్లను చూసి బాధపడటం మానేశానంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి వెరిఫై కావాలని కోరుకున్న అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది విష్ణు ప్రియ.