ఇంతకీ ఈడెవడు? సుధీర్ పై నోరు పారేసుకున్న వర్షిణి? కామెడీ హద్దులు దాటుతోందా?

anchor varshini scolds sudigali sudheer in dhee show

సుడిగాలి సుధీర్ అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ కు ఉన్న క్రేజే వేరు. సుడిగాలి సుధీర్.. ఏ షోలో ఉంటే ఆ షో సూపర్ సక్సెస్ అయినట్టే. అందుకే తెలుగు చానెళ్లన్నీ సుధీర్ వెంట పడుతున్నాయి. బాబ్బాబు.. ఒక్క షోలో గెస్ట్ గా వచ్చినా చాలు.. అంటూ వెంటపడుతున్నాయి. అంతలా బిజీ అయిపోయాడు సుధీర్.

anchor varshini scolds sudigali sudheer in dhee show
anchor varshini scolds sudigali sudheer in dhee show

అయితే.. సుధీర్ అంతలా బిజీ అవ్వడానికి కారణం.. ఆయన చేసే కామెడీ కావచ్చు.. ఆయన మీద ఇతరలు చేసే కామెడీ కావచ్చు.

చాలామంది ఇతర యాంకర్లు, కమెడియన్లు.. ఏ షోలో అయినా సరే.. సుధీర్ ను టార్గెట్ చేస్తారు. ఆయన్ను ఏదో ఒకటి అంటారు.. అలా అంటేనే అక్కడ కామెడీ జనరేట్ అవుతుంది.

ఢీ షోలో కూడా అంతే. ఢీ షోలో అయితే సుధీర్ ఒక్కడే ఒక సైడ్ ఉంటే.. మిగితా టీమ్ అంటే హైపర్ ఆది, వర్షిణి, యాంకర్ ప్రదీప్, రష్మీ.. అంత మరో టీమ్ గా మారి.. సుధీర్ ను ఆడుకుంటారు. అంత క్రేజ్ ఉన్నప్పటికీ.. సుధీర్ మాత్రం వాళ్లు తనపై కామెడీ చేస్తున్నా ఏమనడు.

అయితే.. దాన్నే చాన్స్ గా తీసుకుంటున్న కొందరు యాంకర్లు సుధీర్ పై ఓవర్ గా కామెడీ చేస్తున్నారు. తాజాగా విడుదలైన ఢీ చాంపియన్స్ ప్రోమో చూస్తే అదే అర్థం అవుతుంది.

యాంకర్ వర్షిణి అయితే డైరెక్ట్ గా ఇంతకీ ఈడెవడు? అంటూ స్టేజీ మీదే అందరి ముందూ అనేసరికి.. ఒక్కసారి అందరూ షాక్ అయిపోయారు. నిజానికి అక్కడ కామెడీని పండించడానికి వర్షిణి.. సుధీర్ ను అంత మాట అన్నా కూడా వర్షిణి.. అంత డైరెక్ట్ గా సుధీర్ ను వీడెవడు? అనడాన్ని సుధీర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కామెడీ హద్దు దాటుతోందంటూ హెచ్చరిస్తున్నారు. సుధీర్ పై కుళ్లు కామెడీని ఆపాలంటూ కామెంట్లు పెడుతున్నారు. దానికి సంబంధించిన ప్రోమోను మీరు కూడా చూడండి..

Dhee Champions Latest Promo - DHEE 12 Qualifier - 11th November 2020 Sudheer,Hyper Aadi