Home News టిక్ టాక్ టూ... ఢీ ! తంతే బూరెల గంపలో పడింది అనే సామెత ఈ...

టిక్ టాక్ టూ… ఢీ ! తంతే బూరెల గంపలో పడింది అనే సామెత ఈ పిల్లకి సరిపోతుందేమో?

‘టిక్ టాక్’ అనే ఒక అప్ ప్రపంచం మొత్తం ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇండియాలో ఐతే కుర్రకారు కాలు చెయ్యి నిలవనీయకుండా చేసిందంటే అతిశయోక్తి కానే కాదు. అందరూ నటిస్తూ, డాన్స్ చేస్తూ, మిమిక్రీ చేస్తూ, పాటలు పాడుతూ, చిలిపి పనులు చేస్తూ, తిక్క పనులు చేస్తూ ఏదోరకంగా వీడియోస్ చేస్తూ టిక్ టాక్ లో అప్లోడ్ చేసి వారి కళా నైపుణ్యాన్ని ప్రపంచం ముందు పెట్టేవారు. ఆ విధంగా చాలా మంది తమ ప్రతిభతోనో లేదా వెర్రి వేషాలతోనో ఏదైతేనేమి ఫేమస్ అయ్యారు. అలాంటి వారిని మీడియా అండ్ టీవీ ఛానెల్స్ వాళ్ళు కూడా గుర్తించి ఇంటర్వూ చేయటం , వెండితెర మీద అవకాశాలని కల్పించటం లాంటివి చేశాయి. మన తెలుగు రాష్ట్రాలలో కూడా అలాంటి వారు చాలా మంది ఉన్నారు. అందులో ‘దీపికా పిల్లి ‘ ఇప్పుడు ఏకంగా తెలుగు రాష్ట్రాలలో టాప్ ఛానల్ అయిన ఈటీవీ లో ప్రసారమయ్యే ‘ఢీ ‘ డాన్స్ ప్రోగ్రాంలో ఒక యాంకర్ గా అవకాశాన్ని వరించింది. వివరాలలోకి వెళితే…

Anchor Varshini Replaced By Tik Tok Star Deepika Pilli In Etv Dhee Show
anchor varshini replaced by tik tok star deepika pilli in etv dhee show

ఈ మధ్యనే “ఢీ ” సీజన్ 12 పూర్తవడంతో… కొన్ని మార్పులు చేర్పులు చేసి కొత్తగా ఢీ 13 సీజన్ ప్రారంభించారు. ఈ కొత్త సీజన్‌కు ఢీ క్వీన్స్, కింగ్స్ అని పేరు పెట్టారు. కొత్త సీజన్ ప్రోమో విడుదల చేయగా.. ఇప్పటి వరకూ రెండు రాజ్యాల మధ్య యుద్ధం చూసి ఉంటారు.. ఇద్దరు రాజుల మధ్య యుద్ధం చూసి ఉంటారు. కానీ ఒక రాణికి రాజుకి మధ్య యుద్ధం జరిగితే చూశారా?? అదే ‘ఢీ 13 కింగ్స్ Vs క్వీన్స్’ లో చూపించబోతున్నాం అంటూ యాంకర్ ప్రదీప్ ప్రోమోకి బీభత్సమైన ఎలివేషన్ ఇచ్చాడు.ఈసారి జంటలుగా కాకుండా అమ్మాయిలు ఒకవైపు… అబ్బాయిలు మరోవైపు టైటిల్ కోసం పోరాడబోతున్నట్టు ప్రోమోను బట్టి తెలుస్తోంది. అయితే అబ్బాయిల టీంకి మెంటర్స్‌గా సుడిగాలి సుధీర్, హైపర్ ఆది ఉండగా.. అమ్మాయిల టీంకి యాంకర్ రష్మి, దీపిక పిల్లి మెంటర్స్‌గా కనిపించారు. గత సీజన్లో ఉన్నటువంటి ప్రియమణి, శేఖర్ మాస్టర్, పూర్ణలు నే జడ్జీలుగా కంటిన్యూ చేశారు.

గత సీజన్లో రష్మీకి తోడుగా వర్షిణి సందడి చేసింది. కానీ ఈ కొత్త సీజన్లో వర్షిణి బదులుగా దీపికా పిల్లి అనే టిక్ టాక్ స్టార్ ని తీసుకురావడం హాట్ టాపిక్ అవుతోంది. గత సీజన్‌లో హైపర్ ఆదితో కలిసి వర్షిణి చేసిన హంగామా షో హిట్ అవటానికి ఒక కారణంగా కనిపించింది కూడా. వారి ఇద్దరి మధ్య రొమాన్స్ పీక్స్‌లో ఉండేది. డబుల్ మీనింగ్ డైలాగ్‌ల డోస్ ఓ రేంజ్‌లో ఉండటంతో అనేక విమర్శలు వస్తూ షో కి ‘టి ఆర్ పి ‘ బాగా వచ్చేది. అయితే వర్షిణిని తప్పించారో లేక ఆమె కావాలని తప్పుకుందో తెలియదు కానీ.. వర్షిణి ప్లేస్‌ని రీప్లేస్ చేసింది దీపికా పిల్లి. అయితే వర్షిణి ప్లేస్ లో మెరిసిన ‘దీపికా పిల్లి’ లుక్స్ లో బానే ఆకట్టుకుంది. ఇక ఆది నుండి ఎదురయ్యే పంచ్ లని తట్టుకుని ఎలా కంటిన్యూ అవుతుందో చూడాలి . ఎక్కడో ఉండే ఒక అమ్మాయి ఒక అప్ వల్ల ఈ రోజున ఇంతటి ఫేమ్ పొందింది. ఇలానే టాలెంట్ ఉన్న వారందరూ ఇలానే ఎదగాలని కోరుకుందాం.

Related Posts

Related Posts

Latest News