టిక్ టాక్ దుర్గారావుకు పోటీగా స్టెప్పులేయలేక చేతులెత్తేసిన యాంకర్ సుమ.. వైరల్ వీడియో

anchor suma dance with tiktok durgarao

టిక్ టాక్ దుర్గారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. దుర్గారావు, ఆయన భార్య కలిసి వేసే స్టెప్పులు ఎంతో ఫన్నీగా ఉన్నా… ఆయన ప్రస్తుతం సోషల్ మీడియా స్టార్ అయిపోయారు. ప్రస్తుతం ఆయనకు ఎన్నో షోల నుంచి, సినిమాల నుంచి ఆఫర్లు వస్తున్నాయి.

anchor suma dance with tiktok durgarao
anchor suma dance with tiktok durgarao

అయితే.. తాజాగా దుర్గారావు, ఆయన భార్య క్యాష్ ప్రోగ్రామ్ కు వెళ్లారు. ఆ ప్రోగ్రామ్ కు సుమ యాంకర్ అని తెలుసు కదా. దుర్గారావు రాగానే.. ఆయనతో కలిసి స్టెప్పులేశారు సుమ.

కానీ.. ఆయన ఎనర్జీ ముందు సుమ తేలిపోయారు. ఎందుకంటే.. మ్యూజిక్ వినపడితే చాలు.. దుర్గారావు పూనకం వచ్చిన వ్యక్తిలా రెచ్చిపోయి తనకు వచ్చిన స్టెప్పులన్నీ వేస్తాడు. ఆయనకు పోటీగా డ్యాన్స్ చేయలేక సుమ చేతులెత్తేసింది. మ్యూజిక్ వినపడితే చాలు.. దుర్గారావు ఆగేలా లేడు.. అంటూ సెటైర్ వేసింది.

anchor suma dance with tiktok durgarao
anchor suma dance with tiktok durgarao

ఈ ప్రోగ్రామ్ లో అందరూ సోషల్ మీడియా స్టార్లే పార్టిసిపేట్ చేశారు. చందుసాయి, దీపిక, షణ్ముఖ్, వైష్ణవి, భాను, భార్గవ్ కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేశారు. మొత్తం మీద అందరు కలిసి క్యాష్ ప్రోగ్రామ్ లో రచ్చ రచ్చ చేశారు. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

Cash | Durga Rao, Chandu Sai, Dipika Pilli, Vaishnavi, Shanmukha | 17th October 2020 | Latest Promo