రక్తం కారుతున్నా కూడా.. యాంకర్ రవి కొత్త అవతారం

Anchor Ravi Thotabhavi Still Goes viral

యాంకర్ రవి బుల్లితెరపై స్టార్ యాంకర్. ఈ విషయంలో ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు ఉండవు. అయితే రవి తన స్టార్ ఇమేజ్ వాడి వెండితెరపై హీరోగా ఎదగాలని ప్రయత్నించాడు. కానీ మొదటి ప్రయత్నంలో విఫలయ్యాడు. ఇది మా ప్రేమ కథ అంటూ హీరోగా ప్రేక్షకులను పలకరించాడు. కానీ అది వర్కవుట్ కాలేదు. అయితే తాజాగా మరో సారి హీరోగా తన లక్‌ను పరీక్షించుకునేందుకు వచ్చాడు.

Anchor Ravi Thotabhavi Still Goes viral
Anchor Ravi Thotabhavi Still Goes viral

గ‌ద్వాల్ కింగ్స్ స‌మ‌ర్ప‌ణ‌లో జోగులాంబ క్రియేష‌న్స్ ప‌తాకంపై ఆలూర్ ప్ర‌కాష్ గౌడ్ , దౌలు(విష్ణుప్రియహోట‌ల్) చిన్న స్వామి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అభినేష్. బి స‌హ‌నిర్మాత‌. ఇటీవలే ఈ చిత్రం టీజర్ ను ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ విడుదల చేయగా టీజర్ కి విశేష స్పందన లభించింది. అంతకుముందు వచ్చిన ఫ‌స్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమా ఇటీవలే సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా దర్శకుడు అంజి దేవండ్ల మాట్లాడుతూ ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటినుంచి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. మేము అనుకున్నదానికన్నా చాలా బాగా వచ్చింది సినిమా. సెన్సార్ చేసిన సెన్సార్ సభ్యులు కూడా సినిమా చూసి సంతోషం వ్యక్తం చేశారు. హీరో ర‌వి నటనను ప్రశంసించారు. ముందు నుంచి రవి ఇచ్చిన సపోర్ట్‌ను మర్చిపోలేను. యాక్షన్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో థ్రిల్ చేయడానికి ఈ మార్చి 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నామని అన్నాడు. తాజాగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేయగా.. అందులో గాయాలై రక్త కారుతున్నా కూడా ఏదో కసితో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఆ సంగతేంటో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.