అమ్మ బాబోయే ఆ ఇద్దరూ కలిసిపోయారా… లాస్యపై రవి షాకింగ్ కామెంట్స్

Anchor Ravi Friendship band To Lasya

యాంకర్ రవి అనే పేరు ఇంతలా పాపులర్ అవ్వడానికి కారణం లాస్య. అదే సమయంలో లాస్య పేరు ఇంతగా ఫేమస్ అవ్వడానికి కారణం కూడా రవి. ఈ ఇద్దరూ కలిసి చేసిన ప్రోగ్రాంతో బాగా క్రేజ్ తెచ్చుకున్నారు. రవి లాస్య, లాస్య రవి అని పిలిస్తే తప్పా ఎవ్వరూ గుర్తు పట్టేవారు కాదు. అంతటి క్రేజ్‌ను తెచ్చుకున్న రవి లాస్యలు ఆ మధ్య బద్ద శత్రువుల్లా మారిపోయారు. ఆ తరువాత రవి తన కెరీర్‌లో దూసుకుపోయాడు. లాస్య తన వ్యక్తిగత కారణాల వల్ల అక్కడే ఆగిపోయింది.

Anchor Ravi Friendship band To Lasya
Anchor Ravi Friendship band To Lasya

లాస్య తరువాత రవి.. శ్రీముఖి, వర్షిణి, భాను శ్రీ వంటి వారితో జట్టు కట్టాడు. ఏ షో చేసినా కూడా రవి తన దైన ముద్రను వేశాడు. ఏకంగా హీరోగా కూడా ట్రై చేశాడు. కానీ అంతగా వర్కవుట్ అవ్వలేదు. అయితే రవి ఎప్పుడూ కూడా లాస్యతో ఉన్న కోల్డ్ వార్ గురించి ప్రస్తావించలేదు. ఇద్దరి మధ్య జరిగిన గొడవలుగురించి ఎవ్వరికీ అంతగా తెలియవు.చిన్న చిన్న ఇగో ఇష్యూస్ వల్లే మాట్లాడుకోవడం లేదంటూ లాస్య గతంలో ఓ సారి చెప్పింది.

అయితే తాజాగా అందరికీ ఓ షాక్ ఇచ్చారు ఈ ఇద్దరూ. ఈ కొత్త ఏడాది సందర్భంగా ఈ ఇద్దరూ తమ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. తామిద్దరం కలిసి పోయామని చెప్పేట్టుగా ఓ సింబల్ వదిలారు. ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టుకుని ఫ్రెండ్స్ అయ్యామని చూపించారు. అంతే కాకుండా టామ్ అండ్ జెర్రీ మళ్లీ వచ్చేశాం అంటూ లాస్యపై రవి కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఈ ఊపులోనే ఏదైనా కొత్త షోను ప్రారంభిస్తారేమో చూడాలి.

Anchor Ravi Friendship band To Lasya
Anchor Ravi Friendship band To Lasya