‘ఝాన్సీ కి రాణి’గా యాంకర్ రవి కూతురు.. అదరగొట్టేసిన వియా

Anchor Ravi about Viya in Jhansi ki Rani get up

సోషల్ మీడియాలో యాంకర్ రవి ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. యాంకర్ రవి మాత్రమే కాదు ఆయన భార్య నిత్య, కూతురు వియాలు కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు ఫేమస్. మరీ ముఖ్యంగా వియా క్యూట్ క్యూట్ మాటలు, అల్లరి చేష్టలకు పడిపోని వారెవ్వరూ ఉండరు. ఇద్దరూ కలిసి బుల్లితెరపై చేసే మ్యాజిక్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఆ మధ్య ఇద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది.

Anchor Ravi about Viya in Jhansi ki Rani get up
Anchor Ravi about Viya in Jhansi ki Rani get up

ఇక లాక్డౌన్ సమయంలోనూ యాంకర్ రవి తన కూతురితో కలిసి చేసిన వీడియోలు, ఆడిన ఆటలు ఎంతగానో వైరల్ అయ్యాయి. అనసూయ, రవి, వియా ఇంకా బుల్లితెర తారలందరూ కలిసి ఆడిన ఆటలు బాగానే క్లిక్ అయ్యాయి. అలా వియా సోషల్ మీడియాలో ఇప్పుడు బుల్లి సెన్సేషనల్ స్టార్‌గా మారింది. తాజాగా మరోసారి వియా అందరినీ కట్టిపడేసింది. అది కూడా దేశభక్తురాలిగా అదరగొట్టేసింది.

ఝాన్సీ లక్ష్మీబాయి వేషంలో కనిపించి రిపబ్లిక్ డే సర్ ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం రవి షేర్ చేసిన వియా వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. ఇందులో ఝాన్సీ లక్ష్మీ బాయి తన పిల్లాడిని వీపుకు కట్టుకుని పోరాటం చేసినట్టు దృశ్యాన్ని రీ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించాడు. చిన్నారి వియా కూడా ఎంతో బాగా నటించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతీ ఒక్క అమ్మాయి కూడా ఓ యోధురాలిగా మారాల్సిందే అని రవి చెబుతూ ఈ వీడియోను షేర్ చేశాడు.